సమంత ఇట్నుంచి నరుక్కొస్తోంది

మహేష్‌బాబు సినిమా పోస్టర్‌పై బహిరంగంగా కామెంట్‌ చేసిన సమంత ప్రిన్స్‌ ఫాన్స్‌ని బాగా హర్ట్‌ చేసింది. పైకి ఆమెతో నవ్వుతూనే మాట్లాడుతున్నా కానీ మహేష్‌ కూడా ఇంకా సమంతపై సెటైర్లు వేస్తూ అప్పటి దానికి…

మహేష్‌బాబు సినిమా పోస్టర్‌పై బహిరంగంగా కామెంట్‌ చేసిన సమంత ప్రిన్స్‌ ఫాన్స్‌ని బాగా హర్ట్‌ చేసింది. పైకి ఆమెతో నవ్వుతూనే మాట్లాడుతున్నా కానీ మహేష్‌ కూడా ఇంకా సమంతపై సెటైర్లు వేస్తూ అప్పటి దానికి రివెంజ్‌ తీర్చుకుంటూనే ఉన్నాడు. మహేష్‌తో వరుసగా రెండు సినిమాలు చేసిన సమంతకి మళ్లీ మహేష్‌ నుంచి పిలుపు రాలేదు. 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నపాటి స్లంప్‌ చూస్తున్న సమంత అర్జంటుగా పెద్ద బ్రేక్‌ కోరుకుంటోంది. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ చేస్తున్న సినిమా తప్ప ఇప్పుడు సమంత చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. అందుకే మహేష్‌తో నటించే అవకాశం ఇవ్వమని తననే డైరెక్టుగా అడిగేసింది. త్రివిక్రమ్‌తో కలిసి తాను సినిమా చేస్తున్నా కానీ హీరోయిన్‌గా సమంతకి ఛాన్సుందో లేదో చెప్పలేనని మహేష్‌ అనేసాడు. 

ఇప్పుడు తన కెరీర్‌కి బూస్ట్‌ కావాలంటే ఒక టాప్‌ స్టార్‌ సినిమాలో ఛాన్స్‌ తప్పనిసరి కనుక మహేష్‌తో తీసే సినిమాలో అవకాశం ఇమ్మని త్రివిక్రమ్‌ని పీడిస్తోందట సమంత. అత్తారింటికి దారేది తర్వాత ఇప్పుడు ఆమెతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్న త్రివిక్రమ్‌కి సమంతపై మంచి ఇంప్రెషనే ఉంది. అది హెల్ప్‌ అయి సమంతకి మళ్లీ మహేష్‌తో ఛాన్స్‌ వస్తుందో లేదో చూడాలి.