ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నారు అభిమానులు. దీనికి రెండు కారణాలు. ఒకటి రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్ ను చూడోచ్చు. రెండు ఆ తరువాత ఎన్టీఆర్ సినిమాలు చకచకా వస్తాయి.
త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ సినిమా. ఈ కేజీఎఫ్ డైరక్టర్ ఎన్టీఆర్ కోసం ఒక హై బడ్జెట్, హై స్పాన్ వున్న కథను రెడీ చేసారట. ఈ కథను ఎన్టీఆర్ వినడం ఒకె చేసేయడం అయిపోయింది.
మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమా 2020 సెకండాఫ్ లో స్టార్ట్ అవుతుంది. కేజిఎఫ్ 2 పని పూర్తికాగానే ప్రశాంత్ నీల్ వర్క్ స్టార్ట్ చేస్తారట. ఎన్టీఆర్ కు చెప్పిన కథను స్క్రిప్ట్ రూపంలోకి తీసుకువస్తారు. ప్రశాంత్ నీల్ చెప్పిన కథ అతని స్టయిల్ లోనే, భారీ ఎలివేషన్లు, ఎమోషన్లతో కూడా చాలా పెద్ద స్పాన్ తో వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన నాటి నుంచి కనీసం ఏడాది సమయం పడుతుందని, బడ్జెట్ కూడా వంద కోట్లకు పైగానే వుంటుందని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ పేరు ఇప్పుడు అన్ని భాషల ప్రేక్షకులకు పరిచయం అయినందున, దీనికి ముందు ఆర్ఆర్ఆర్ వస్తున్నందున, ఈ సినిమాను కూడా అన్ని లాంగ్వేజ్ ల్లో విడుదల చేసే అవకాశం వుందని, అందువల్ల బడ్జెట్ సమస్య కాదని మైత్రీ మూవీస్ అధినేతలు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత తివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలు చేసేలోగా, కొరటాల శివ తన వంతుగా చిరంజీవి, బన్నీ సినిమాలు పూర్తి చేసుకుని ఎన్టీఆర్ దగ్గరకు వస్తారు.