ఓంకార్ బాగానే పట్టేసాడే?

ఓంకార్..ఆట ప్రోగ్రామ్ తో అన్నయ్యగా మారిపోయినవాడు. ఇప్పుడు స్వంత తమ్ముడు అశ్విన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అంతకు ముందు జీనియస్ తో తాను జీనియస్ అనిపించుకుందాం అనుకుని ఫెయిలయ్యాడు. Advertisement ఇప్పుడు సమ్…

ఓంకార్..ఆట ప్రోగ్రామ్ తో అన్నయ్యగా మారిపోయినవాడు. ఇప్పుడు స్వంత తమ్ముడు అశ్విన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అంతకు ముందు జీనియస్ తో తాను జీనియస్ అనిపించుకుందాం అనుకుని ఫెయిలయ్యాడు.

ఇప్పుడు సమ్ థ్రిల్లర్ తో మళ్లీ ట్రయ్ చేస్తున్నాడు. దీనికి రాజగారి గది అని పేరు పెట్టాడు. సెట్ ల మీద కావచ్చు, ఇళ్ల దగ్గర కావచ్చు, దొరికిన యాక్టర్ ను దొరికినట్లు బైట్ తీసుకుని, ఓ విడియో చేసి వదిలేసాడు. టీవీ చానెళ్లు ప్రారంభమైనపుడు బైట్ లు తీసుకున్న మాదిరిగా వెంకటేష్ నుంచి నిఖిల్, సందీప్ కిషన్, మీదుగా తరుణ్ వరకు, సప్తగిరి నుంచి వైవా హర్ష వరకు, ఆఖరికి పెద్దాయిన పరుచూరి తో కూడా రాజుగారి గదేంటి అబ్బా..అంటూ క్వశ్చన్ మార్కు ఫేస్ లు పెట్టించి, కవ్వింత మాటలు వినిపించాడు.

What Is Rajugaari Gadhi

సరే ఇవన్నీ సినిమా మీద ఆసక్తి పెంచవచ్చు..కానీ ఆడించేది మాత్రం సినిమాలో దమ్మే. జీనియస్ కు కూడా అప్పట్లో పబ్లిసటీ కుమ్మేసారు. కానీ ఫలితం లేకపోయింది. మరి ఈ రాజుగారి గది ఏమేరకు అందంగా వుంటుందో చూడాలి. ఐస్ క్రీమ్ పాప తేజస్విని ఇందులో హీరోయిన్.