Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'పార్క్' పక్కకెళ్లద్దురో

'పార్క్' పక్కకెళ్లద్దురో

తెలుగు సినిమా జనాలకు ఇష్టమైన హోటల్ ఏదీ అంటే 'పార్క్ హయాత్'. ఇంటర్నేషనల్ ఆంబియన్స్, వరల్డ్ వైడ్ మెనూ, ప్రయివసీ,  సినిమా రంగానికి కేంద్రమయిన జూబ్లీ హిల్స్ లో వుండడం, ఇలా అన్ని విదాలా పార్క్ హాయాత్ అన్నది ఫేమస్ అయిపోయింది. ఎవరితో కాస్త ప్రయివసీగా మాట్లాడాలన్నా అక్కడి వెళ్లి కూర్చుని మాట్లాడి వచ్చేయచ్చు. 

పైగా అక్కడ వున్న సర్వీస్ అపార్ట్ మెంట్లు అంటే మన సినిమా పెద్దలకు మరీ ముచ్చట. చాలా మంది టాప్ సినిమా పీపుల్ అక్కడ సర్వీస్ అపార్ట్ మెంట్లు తీసుకుని వుంచుకున్నారు. ఏటా భారీగా టారిఫ్ పే చేస్తున్నారు. పోలిటికల్ లీడర్లకు కూడా పార్క్ హయాత్ అంటే కాస్త మోజు ఎక్కువే.

పైగా టి సుబ్బరామి రెడ్డితో వున్న సాన్నిహిత్యంతో చాలా మంది కొంత ఫ్రీ, మరికొంత డిస్కౌంట్ సదుపాయం కూడా ఎంజాయ్ చేస్తుంటారు. హీరోలు అయితే నేరుగా సుబ్బరామి రెడ్డి సూట్ లోనే వుంటూ ఇంటర్వ్యూలు ఇస్తూ వుంటారు. ఇలాంటి పార్క్ హయాత్ ఇప్పుడు తరచు వార్తల్లోకి ఎక్కుతోంది. ప్రయివసీకి మారుపేరు అయిన పార్ట్ హయాత్ ఇక ఏమాత్రం సురక్షితం కాదు అని వినిపిస్తోంది.

చాలా కాలం క్రితం ఓ నటి ఇదే హోటల్ లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఆ తరువాత మరే గడబిడ లేదు. పలువురు సినిమా, రాజకీయ సెలబ్రిటీలు తమ పేకాటకు, తమ 'సంబంధాలకు' ఈ హోటల్ ను ఆడ్డాగా చేసుకున్నారనే వార్తలు తరచు వినిపిస్తూనే వున్నాయి. ఇటీవల సుజన చౌదరి సిసి ఫుటేజ్ అవుట్ పుట్ ను పోలీసులు తీసుకోవడంతో మళ్లీ హడావుడి మొదలయింది. దాంతో సుజన చౌదరి ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేసారు.

మరో విషయంలో కూడా పోలీసులు సిసి ఫుటేజ్ తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వివరాలు ఏవీ బయటకు బాహాటంగా రాలేదు. దీనికి తోడు ఓ రేవ్ పార్టీ జరిగిందని, దానిని పోలీసులు భగ్నం చేసారని నిన్నటికి నిన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సర్వీస్ అపార్ట్ మెంట్లు కూడా తనిఖీ చేసారంటూ వార్తలు గుప్పుమన్నాయి.

దీంతో సినిమా జనాలు ఇక 'పార్క్' పక్కకు వెళ్లకూడదనే కామెంట్లు పాస్ చేస్తున్నారు. కాస్త నలుగురు అయిదుగురు సినిమా జనాలు కలిస్తే చాలా పార్క్ లో కూర్చుని పేకాడం, మందు కొట్టడం కామన్. డిస్ట్రిబ్యూటర్లు పార్క్ లో దిగితే, ఇండస్ట్రీ జనాలు అక్కడికే వెళ్లి సరదాగా గడపడం కామన్. ఇప్పుడు ఇవన్నీ రిస్క్ అనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.  వెళ్లినా మామూలు సినిమా డిస్కషన్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలే తప్ప, అదనపు కార్యక్రమాలకు ఇక సేఫ్ కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?