cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ అడ్వాన్స్ లు ఇక అంతేనా?

పవన్ అడ్వాన్స్ లు ఇక అంతేనా?

కోట్ల ఆదాయం వచ్చే సినిమాలను వదిలేసుకున్నా, ప్రజాసేవకే అంకింతమై వున్నా, ఇక సినిమాలు చేసేదిలేదు. పూర్తిస్థాయిలో రాజకీయాలకే పనిచేస్తా.. ఇంచుమించు ఇలాంటి డైలాగులు అనేకసార్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. చెబుతూనే వున్నారు. జనసేన పార్టీని ఇవ్వాళ కాకపోతే, భవిష్యత్ లో అయినా విజయతీరం దిశగా నడపాలని ఆయన అనుకుంటున్నారు. అంతా బాగానే వుంది. సంతోషం. ఓ నిబద్దతతో విజయం కోసం, రాజకీయాలు చేయడం సంతోషించదగ్గ విషయం.

కానీ సినిమాలు ఇక చేయనని ఆయన చాలా క్లారిటీతో వుండి కూడా, తన దగ్గర వున్న నిర్మాతల అడ్వాన్స్ లు వెనక్కు ఎందుకు ఇవ్వడం లేదో? ఇదే ఎవ్వరికీ సమాధానం దొరకని ప్రశ్న. బయటవారికే కాదు, అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలకు కూడా. హారిక హాసిని, మైత్రీ, ఇలా మరో ఒకటి రెండు అడ్వాన్స్ లు పవన్ దగ్గర వున్నాయని వినికిడి. వీరిలో మైత్రీది కాస్త పెద్ద మొత్తమే అని తెలుస్తోంది.

అడ్వాన్స్ లు అంటే రూపాయి, రెండు కాదు, కోట్లలో. ఎంత వడ్డీలు కట్టాలి ఇచ్చిన నిర్మాతలు. కానీ పవన్ మాత్రం గమ్మున వుంటారు. చేస్తాను, చేయరు అన్నది క్లారిటీగా చెప్పి, అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వరు. కానీ నిర్మాతలు మాత్రం ఎప్పటికైనా సినిమా చేయబోతారా? అని ఆశగా ఎదురుచూస్తుంటారు.

కానీ నిర్మాతలకు అర్థం అవుతోందో లేదో కానీ, పవన్ యాభైకి దగ్గర పడుతున్నారు. ఇంకా ఆయన హీరోగా చేస్తాను అంటే చూసే జనాలు వుండొచ్చు కానీ గతంలో మాదిరిగా వంద కోట్ల రేంజ్ లో వుంటుందా? అని అనుమానం. లేదా బాలయ్య, నాగార్జున, వెంకీ లాంటి సీనియర్ హీరోల చిత్రాల జాబితాలో చేరి యాభై కోట్ల రేంజ్ సినిమాల మాదిరిగా వుంటాయా?

అలా అయితే పవన్ కు సినిమాలు చేయడం, పవన్ తో సినిమాలు చేయడం రెండూ కిట్టుబాటు కాదు కూడా. అందువల్ల సినిమాలు చేయను అని ఫుల్ క్లారిటీ వున్నపుడు అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేయడం బెటరేమో?

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?