ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కోట్ల రూపాయలట!

కర్ణాటకలో మళ్లీ రాజకీయం కోట్ల రూపాయలాట మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేది లేదంటూ కమలం పార్టీ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే అంతర్గతంగా మాత్రం వేరే రాజకీయం నడుస్తోందనే ప్రచారం సాగుతూ ఉంది. అందులో…

కర్ణాటకలో మళ్లీ రాజకీయం కోట్ల రూపాయలాట మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేది లేదంటూ కమలం పార్టీ నేతలు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే అంతర్గతంగా మాత్రం వేరే రాజకీయం నడుస్తోందనే ప్రచారం సాగుతూ ఉంది. అందులో భాగంగా రాజీనామా చేసి వచ్చే ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల ఆఫర్లు వెళ్తున్నాయనే టాక్ వినిపిస్తూ ఉంది.

తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం కూలిపోవాలన్నట్టుగా బీజేపీ ఆ రాజకీయాన్ని అమలు పెడుతూ ఉందనే ప్రచారం సాగుతూ ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు వాళ్లకై వాళ్లు రాజీనామా చేసి వస్తే బీజేపీ నుంచి కోట్ల రూపాయలు అందుతూ ఉన్నాయనే ఆరోపణ వినిపిస్తూ ఉంది.

ఈ మేరకు జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణ చేశారు. తన దగ్గరకు బీజేపీ వాళ్లు నలభై కోట్ల రూపాయలతో వచ్చారని, రాజీనామా చేయాలని కోరారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తను డబ్బుకు  అమ్ముడుపోలేదని, ఆ డబ్బును ఏం చేసుకోవాలో కూడా తనకు తెలియదని.. అందుకే అమ్ముడుపోయే రాజకీయాలకు తను దూరంగా నిలిచినట్టుగా ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశారని, అయితే డబ్బులు అందకపోవడంతో వారు రాజీనామా చేసినట్టుగా జేడీఎస్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మరి ఆ జేడీఎస్ ఎమ్మెల్యే చెబుతున్న మాటల్లో నిజం ఎంతో కానీ.. కర్ణాటకలో అస్థిర రాజకీయం కోట్ల రూపాయల పందేరంగా మారిందని స్పష్టం అవుతోంది.

హంగ్ రాజకీయాల పట్ల ప్రజల్లో మరింతగా అసహనం పెరిగే పరిణామాలు అక్కడ సాగుతూ ఉన్నాయి.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?