మేము సైతం అంటూ టాలీవుడ్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి అనేక మంది నటులు, ఇతర చిత్ర రంగ ప్రముఖులు, చిన్నా పెద్దా అని తేడా లేకుండా తరలి వచ్చారు. స్టేజ్ షో లు చేసినవారుచేసారు. ఆటలు ఆడిన వారు ఆడారు. ఒంట్లో బాగులేకున్నా వచ్చానని ఎన్టీఆర్ అన్నారు. రికార్డెడ్ ఇంటర్వూ ఇచ్చి మహేష్ తన పెద్ద మనసు చాటుకున్నారు. బాలయ్య బాబు పాటలు పాడారు. చిరంజీవి సైతం అంత్యాక్షరి లో పాల్గోన్నారు.
మరి ఇంతకీ పవర్ స్టార్, టాలీవుడ్ టాప్ స్టార్లలలో ఒకరైన పవన్ కళ్యాణ్ జాడ మాత్రం లేదు. పోనీ ఆట పాటలకు కాకపోయినా, కనీసం చంద్రబాబు నాయుడు వచ్చినపుడైనా రావచ్చుగా..అదీ లేదు. అన్నట్లు పవన్ కు అత్యంత సన్నిహితుడు మాటీవీ శరద్ మరార్. ఈ కార్యక్రమం హక్కులు సురేష్ బాబు చొరవతీసుకుని మరీ జెమినికి దఖలు పరిచారు. దానిపై మాటీవీ చాలా గుర్రుగా వుంది.
దాని అధినేతలు అల్లు అరవింద్, నాగ్ కు టాలీవుడ్ లో భాగం కాబట్టి సైలెంట్ గా వున్నారు. కానీ మాటీవీ మేనేజ్ మెంట్ మాత్రం తన పోటీ తత్వం తాను ప్రదర్శించింది. అందులో శరద్ మురార్ కూడా భాగమే. మరి ఆయనకు నచ్చలేదు కాబట్టి పవన్ రాలేదనుకోవాలా? లేక పవన్ కు నలుగురిలోకి ఎక్కువగా రావడం అలవాటు లేదు కాబట్టి రాలేదనుకోవాలా?