చానెళ్లు పోటీ పడ్డాయి

జెమిని టీవీకి మేము సైతం హక్కులు తక్కువకే ఇచ్చేయడంతో మాటీవీకి మాచెడ్డ కోపం వచ్చినట్లుంది. ఈ రోజు సినిమాలు, కార్యక్రమాలు దంచేసింది. మహేష్ దూకుడు, పవర్ స్టార్ అత్తారింటికి దారేది వంటి సినిమాలు చానెల్…

జెమిని టీవీకి మేము సైతం హక్కులు తక్కువకే ఇచ్చేయడంతో మాటీవీకి మాచెడ్డ కోపం వచ్చినట్లుంది. ఈ రోజు సినిమాలు, కార్యక్రమాలు దంచేసింది. మహేష్ దూకుడు, పవర్ స్టార్ అత్తారింటికి దారేది వంటి సినిమాలు చానెల్ చూసే జనాలను పక్కకు వెళ్లనివ్వలేదు. 

జెమిని పెట్టడం, ఏదో ఓ మ్యూజిక్ ట్రూప్ పాటలు మొదలెట్టగానే, ఈ చానెల్ కు వచ్చి సినిమా చూడ్డం, మళ్లీ అటు, ఇటు అలా కానిచ్చేసారు చాలా మంది వ్యూవర్స్. అలాగే జీ టీవీ కూడా తడాఖా వంటి హిట్ సినిమాలతో తన ప్రయత్నం తాను చెసింది.

ఇదిలా వుంటే జెమిని ఈ కార్యక్రమంలో పది సెకెండ్ల స్లాట్ కు 18వేల రేటు ఫిక్స్ చేసి, బాగానే ఆదాయం చేసుకుందని టీవీ మాధ్యమానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు దాదాపు రెండున్నర కోట్లకు పైగా ఆదాయం వచ్చి వుంటుందని అంచనాలు కడుతున్నారు. 

మూడు పాతిక కోట్ల వరకు మేము సైతం కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కార్యక్రమం పీస్ పీస్ చేయచ్చు..రకరకాలుగా వాడుకోవచ్చు. అందువల్ల ఆ గ్యాప్ సులువుగానే పూడుకుపోతుందని అంటున్నారు.