పవన్ సినిమా ఈ సారి కన్ ఫర్మ్

పవన్ కళ్యాణ్ –సంపత్ నంది సినిమా ఇదిగో అదిగో అంటూ వెనక్కు వెనక్కునడుస్తోంది. అత్తారింటికి దారేది విడుదలై 50రోజులు దాటినా ఈ సినిమాకు కొబ్బరికాయ పగలలేదు. తాజాగా డిసెంబర్ లో ప్రారంభం అన్న వార్త…

పవన్ కళ్యాణ్ –సంపత్ నంది సినిమా ఇదిగో అదిగో అంటూ వెనక్కు వెనక్కునడుస్తోంది. అత్తారింటికి దారేది విడుదలై 50రోజులు దాటినా ఈ సినిమాకు కొబ్బరికాయ పగలలేదు. తాజాగా డిసెంబర్ లో ప్రారంభం అన్న వార్త వినిపిస్తోంది. అయితే ఈ సారి పక్కా అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. 

ఎందుకంటే డిసెంబర్లో పవన్ తన కార్యక్రమాలను చాలా వరకు కుదించుకుంటున్నట్లు బోగట్టా. తన సినిమా ప్రారంభం అయితే మరే ఇతర కార్యక్రమాలకు హాజరు కానని, ముందుగానే అడియో ఫంక్షన్ పెట్టుకోమని రేయ్ దర్శకుడు వైవిఎస్ చౌదరికి చెప్పినట్లు తెలిసింది. దీన్ని బట్టి డిసెంబర్ లో పవన్ సినిమా పట్టాలు ఎక్కడం ఖాయం.