బలుపు సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది పివిపి సంస్థ. ఫరావలేదనిపించుకుంది. త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతోంది. అది కూడా మినిమమ్ గ్యారంటీయే. కానీ మధ్యలో తమిళ తంబి సెల్వరాఘవన్ చేతిలో పడ్డారు.
ముఫై కోట్లతో అయిపోతుందనుకున్న సినిమా 60 కోట్లయింది. సినిమా వ్యవహారం చూసి, చివర్న మొత్తం తమ చేతిలోకి తీసుకున్నా ఫలితం లేకపోయిందని తెలిసింది. అందులో పదోశాతం కూడా దక్కేలా లేదని అంచనా. మల్టీ మిలియనీర్లు సినిమారంగంలోకి వస్తే ఇలాగే వుంటుంది.
కిందామీదా చూసుకోకుండా, కథ, కథనాలు తెలుసుకోకుండా ఖర్చు చేసి, దర్శకులకు బలైపోయి బలుపు వదిలించుకోవడమే. అవును..ఇంతకీ ఈ పరిస్థితుల్లో పవన్ తో సినిమా వుంటుందా?