హీరోల పారితోషికాలు కోట్లు దాటుతున్నాయి. కథానాయికలదీ అదే తీరు. ఇప్పుడు టైటిల్‌కి కోట్లు తగలేస్తోంది చిత్రసీమ. టైటిల్లో ఉన్న.. కంటెంట్ అలాంటిది లెండి. గబ్బర్ సింగ్ టైటిల్ పెట్టుకొంటే మాకు రాయల్టీ కట్టాల్సివస్తుందని షోలే నిర్మాతలు.. కంగారు పెట్టేశారు.
దాంతో గబ్బర్ సింగ్ సీక్వెల్‌కి పేరేం పెడతారు?? అనే చర్చ మొదలైంది. బెంగాల్ టైగర్, గబ్బర్ అనే పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. అయితే గబ్బర్ సింగ్ సెంటిమెంట్నీ, ఆ టైటిల్‌కి ఉన్న పవర్‌ని వదులుకోని చిత్ర బృందం… షోలే నిర్మాతలకు భారీ మొత్తాన్ని చెల్లించి ఆ టైటిల్‌ని కొనుక్కొన్నాయి.
ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా?? రూ. 2 కోట్లు. ఓ టైటిల్ కోసం ఇంత మొత్తం చెల్లించడం తెలుగు చిత్రసీమ వరకూ ఇదే తొలిసారి. కొబ్బరి కాయ్ కొట్టక మునుపే పవన్ కల్యాణ్ సాధించిన సంచలనం ఇది. ఇక.. సినిమా బయటకు వచ్చాక ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.