పవన్‌ని నితిన్‌ సపోర్ట్‌ చేస్తాడా.?

పవన్‌కళ్యాణ్‌ పేరు చెప్పుకుని వరుస సక్సెస్‌లు కొడ్తోన్న హీరో నితిన్‌, పవన్‌కళ్యాణ్‌ కొత్త పార్టీ జనసేనకు మద్దతిస్తాడా.? పవన్‌ని సపోర్ట్‌ చేస్తాడా.? అన్న విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. Advertisement చిరంజీవితో…

పవన్‌కళ్యాణ్‌ పేరు చెప్పుకుని వరుస సక్సెస్‌లు కొడ్తోన్న హీరో నితిన్‌, పవన్‌కళ్యాణ్‌ కొత్త పార్టీ జనసేనకు మద్దతిస్తాడా.? పవన్‌ని సపోర్ట్‌ చేస్తాడా.? అన్న విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

చిరంజీవితో పోల్చితే, పవన్‌కళ్యాణ్‌కి సినీ వర్గాల నుంచి ఎంతో కొంత పాజిటివ్‌ స్పందన లభిస్తోంది. పవన్‌కి మద్దతు పలుకుతున్న సినీజనం బాగానే కన్పిస్తున్నారు. ప్రజారాజ్యం విషయంలో సినీ మద్దతు చాలా తక్కువగానే వుందని చెప్పాలి. పవన్‌ చుట్టూ వివాదాలు వున్నా, పవన్‌ ఎప్పుడూ ఆ వివాదాలను పట్టించుకోకపోవడమే పవన్‌ని చిరంజీవికన్నా భిన్నమైన వ్యక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా సినీ పరిశ్రమ చూడటానికి కారణంగా చెప్పుకోవచ్చేమో.

పైగా, సినీ పరిశ్రమలో చిరంజీవి పట్ల చాలామందికి గౌరవం వున్నా, పవన్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం వుంది. అదే పవన్‌కి రాజకీయాల్లోనూ సినీ పరిశ్రమ నుంచి ఎక్కువమంది మద్దతు పలికేందుకు అవకాశం కల్పించిందని సినీ జనం చెప్పుకుంటున్నారు.

నితిన్‌ ఇప్పటికే పవన్‌ పట్ల సానుకూలంగా వున్నాడనీ, అయితే రాజకీయ ఆలోచనలు లేకపోవడంతో, జస్ట్‌ నైతిక మద్దతు పలకడంతోనే నితిన్‌ సరిపెడతాడనీ అంటున్నారు. నితిన్‌ వ్యక్తిగతంగా పవన్‌ని కలిసి విషెస్‌ అందజేశాడని కూడా గుసగుసలు విన్పిస్తున్నాయి టాలీవుడ్‌ వర్గాల్లో.

మోహన్‌బాబు కుమార్తె లక్ష్మి, సినీ నటుడు తనికెళ్ళ భరణి తదితరులు ఇప్పటికే పవన్‌కి మద్దతు ప్రకటించిన విషయం విదితమే.