అమెరికాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కార్ల ర్యాలీ చూసి, జనాలకు కాస్త ఆశ్చర్యం కలిగింది. పవన్ కు అమెరికాలో అంత సీనుందా? అని. నిన్నటికి నిన్న జరిగిన ఓ మీట్ కు పట్టుపని రెండు డజన్ల మంది కూడా హాజరు కాకపోవడం చూసి..మళ్లీ ఇదేంటీ? అనుకున్నారు.
అయితే తెలుగుదేశం వర్గాల సమాచారం ఏమిటంటే..?పవన్ కోసం కార్ల ర్యాలీ అరేంజ్ చేసింది తెలుగుదేశం వర్గాలేనట. ఇక్కడ నుంచి వెళ్లిన కొన్ని లోపాయి కారీ ఆధేశాల మేరకు అక్కడ కార్ల ర్యాలీ ఏర్పాటు చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు. ఆ మధ్య బాలయ్య వెళ్లినపుడు శాతకర్ణి కోసం కార్ల ర్యాలీ ఏర్పాటు చేసిన జనాలు కొంత మంది ఈ కార్ల ర్యాలీలో చురుగ్గా పాల్గోన్నారని కూడా అంటున్నారు.
అందువల్ల కార్ల ర్యాలీ సక్సెస్ అయిందని, లేదూ అంటే పవన్ మీటింగ్ మాదిరిగానే వెలవెల పోయేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం మిత్ర పక్షం గా జనసేన వుంది కాబట్టి, ర్యాలీ ఏర్పాటు తప్పలేదంటున్నాయి తెలుగుదేశం వర్గాలు. ఇదే నిజమైతే, పవన్ ర్యాలీ స్వయం ప్రకాశం కాదనుకోవాలి మరి.