Advertisement


Home > Movies - Movie Gossip
పేరు మార్చమంటున్న మహేష్ ఫ్యాన్స్

టాలీవుడ్ లో సెంటిమెంట్ లు ఎక్కువ. సినిమా ప్లానింగ్ దగ్గర నుంచి, టైటిల్ మీదుగా, విడుదల వరకు అన్నింటికీ సెంటిమెంట్ ను ఫాలో అవుతారు. హీరోయిన్ సక్సెస్ లు, అందులో వున్న నటీనటుల లెగ్ లు అన్నీ చూస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ పై ఆయన ఫ్యాన్స్ ఇలాగే సెంటిమెంట్ ఫీలవుతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఒకే ప్రొడక్షన్ హవుస్ మూడు సినిమాలు నిర్మించింది. టైగర్, విన్నర్, మిస్టర్. ఈ మూడు సినిమాలు ఏవరేజ్ గా నిలిచాయి. సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ, వరుణ్ తేజ ఎవరికీ కూడా పెద్దగా కలిసి రాలేదు ఈ 'ర్ టైటిళ్లు. ఇప్పుడు ఇదే ప్రొడక్షన్ హవుస్, మరో ప్రొడక్షన్ హవుస్ కలిసి మహేష్ బాబుతో స్పైడర్ సినిమా నిర్మిస్తున్నాయి. టైగర్, విన్నర్, మిస్టర్ ల మాదిరిగానే సౌండ్ వస్తోంది స్పైడర్ కూడా. 

వాస్తవానికి ఈ సినిమాకు ముందు సంభవామి టైటిల్ అనుకున్నారు. అందరికీ నచ్చింది కానీ, మహేష్ బాబుకు మాత్రం నచ్చలేద. దాంతో స్పైడర్ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఆ మూడు టైటళ్లకు దగ్గరగా ఇది వుండడంతో అభిమానులు సెంటిమెంట్ ఫీలవుతున్నారట.