నూతన సంవత్సరం సందర్భంగా రుద్రమదేవి గా అనుష్క ఫస్ట్ లుక్ ను విడుదలచేసారు దర్శక నిర్మాత గుణశేఖర్. ఈ సందర్భంగా అనుష్క ఈ క్యారెక్టర్ కోసం ధరించిన నగల విలువ అయిదుకోట్లు అని ప్రకటించారు.
జోధా అక్బర్ తరువాత అంత విలువైన నిజమైన బంగారు నగలు, వాడిన సినిమా ఇదే అన్నారు. ఈ నగలను తయారుచేసిన సంస్థ, ఈ మోడళ్లను మార్కెట్ లోకి కూడా తెస్తుందన్నారు. అంతాబాగానే వుంది. కానీ అనుష్క ధరించిన ఆభరణాలు పరిశీలిస్తే, అవి అయిదుకోట్ల విలువ వుంటాయా అన్నది ఓ చిన్న సందేహం.
అసలు ఆ మధ్య ఆ నగలు పోయాయని, కాదు కంపెనీ ఉద్యోగి మాయం చేసారని ఒకసారి, అసలు అవి గిల్టు నగలని మరొసారి వార్తలు వినిపించాయి. కానీ తరువాత ఆ సంగతే ఎవరూ ఏమీ మాట్లడలేదు. ఈ పెద్ద సందేహం అలాగే వుండిపోయింది.