Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో.. ఫీవర్ స్టార్ట్స్ నౌ

సాహో.. ఫీవర్ స్టార్ట్స్ నౌ

బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో.. ఈ సినిమా విడుదలపై వున్న డౌట్ లు అన్నీ తీరిపోయాయి. మరో ఏడు వారాల్లో ఈ సినిమా జనం ముందుకు రాబోతోందని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నిర్మాణ సంస్థ అయిన యువి సినిమా ప్రచారానికి స్కీమ్ రెడీ చేసింది. ఇండియా వైడ్ గా సినిమా అన్ని లాంగ్వేజెస్ లో విడుదల కాబోతున్నందున సోషల్ నెట్ వర్క్ లో సినిమా ప్రచారం మోత మోగేలా ప్రచారం ప్లాన్ చేసింది.

ఇటీవలే పార్క్ హయాత్ హోటల్లో ప్రభాస్ కు స్పెషల్ ఫోటో షూట్ చేసారు. ఇప్పటికే మూడు మాంచి పోస్టర్లు రెడీ చేసారు. ఇవ్వాళ ప్రభాస్ వదిలన పోస్టర్ వాటిల్లో ఒకటి. మాంచి గన్ పట్టుకున్న పోస్టర్ మరోటి వుంది. అలాగే హీరోయిన్ తో వుండే పోస్టర్ కూడా.

ఇకపై వీక్లీ వన్స్ ప్రచార చిత్రాలు, పోస్టర్ లు, మేకింగ్ విడియోలు, ఇలా ఒక్కోటీ వారం వారం విడుదల చేయానికి ప్లాన్ చేసారు. ఇటీవలే ప్రభాస్ ఫేస్ బుక్ లో కూడా ఫ్యాన్స్ ను పలకరించడం మొదలుపెట్టాడు. ఇన్ స్టా గ్రామ్ సంగతి సరేసరి. ముంబాయికి చెందిన టీమ్ ఇవన్నీ చూసుకుంటోంది.

మొత్తంమీద సాహో ఫీవర్ స్టార్ట్ అయింది. ఆగస్టు 15 వేళకు టాప్ కు చేరుకుంటుంది.

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?