అక్టోబర్ లో పెళ్లి.. ఇంతలోనే మరో కొత్త సినిమా

సమంత – నాగచైతన్య పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్ 6న వీళ్ల వివాహం జరగుతుంది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా కాస్త సినిమాలు తగ్గించుకుంటారు. నాగచైతన్య అదే పని చేస్తున్నాడు. కానీ…

సమంత – నాగచైతన్య పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ అయింది. అక్టోబర్ 6న వీళ్ల వివాహం జరగుతుంది. ఇలాంటి టైమ్ లో ఎవరైనా కాస్త సినిమాలు తగ్గించుకుంటారు. నాగచైతన్య అదే పని చేస్తున్నాడు. కానీ సమంత మాత్రం కొత్తగా మరో సినిమా స్టార్ట్ చేయబోతోంది. తమిళ్ లో శివకార్తికేయన్ హీరోగా నటించనున్న సినిమాకు ఫ్రెష్ గా కాల్షీట్లు కేటాయించింది సమంత.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ చేతిలో 3 తెలుగు సినిమాలున్నాయి. మరో 2 తమిళ సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు మరో కోలీవుడ్ మూవీకి కూడా డేట్స్ ఇచ్చింది. తెలుగులో మహానటి, రాజుగారి గది-2, రంగస్థలం సినిమాల్లో నటిస్తోంది సమంత. అటు తమిళ్ లో విజయ్, విశాల్ తో సినిమాలు చేస్తోంది. ఈనెల 16 నుంచి శివకార్తికేయన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతోంది సమంత.

పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తుందని నాగచైతన్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అటు సమంత కూడా ఇదే విషయం చెప్పింది. అయితే సెప్టెంబర్ నుంచి ఈ జంట 3 నెలల పాటు గ్యాప్ తీసుకోబోతోంది. సో.. గ్యాప్ కు ముందే తెలుగులో రామ్ చరణ్ రంగస్థలం సినిమాను, తమిళ్ లో విజయ్ సినిమాను కంప్లీట్ చేయాలనేది సమంత టార్గెట్. మిగతా సినిమాలన్నీ పెళ్లి తర్వాతే.