‘సర్కారు’ కు కోవిడ్ ఎఫెక్ట్

ఒక్కో సినిమా యూనిట్ కు కోవిడ్ ఎఫెక్ట్ తగులుతోంది. వకీల్ సాబ్ ఫంక్షన్ పుణ్యమా అని పవన్ కళ్యాణ్, ఆనందసాయి దగ్గర నుంచి ఆ పంక్షన్ కు వెళ్లిన మీడియా జనాలకు కూడా కరోనా…

ఒక్కో సినిమా యూనిట్ కు కోవిడ్ ఎఫెక్ట్ తగులుతోంది. వకీల్ సాబ్ ఫంక్షన్ పుణ్యమా అని పవన్ కళ్యాణ్, ఆనందసాయి దగ్గర నుంచి ఆ పంక్షన్ కు వెళ్లిన మీడియా జనాలకు కూడా కరోనా సోకింది. 

ఒక్కో యూనిట్ తమ తమ మెంబర్లకు టెస్ట్ లు చేయిస్తున్నాయి. వ్యాక్సీన్ లు వేయిస్తున్నాయి. అయినా సమస్య తప్పడం లేదు. లేటెస్ట్ గా సర్కారువారి పాట యూనిట్ కు కరోనా సమస్య వచ్చింది. దాంతో షూటింగ్ ను నిలిపి వేసారు. 

ఎప్పటికప్పుడు టెస్ట్ లు చేయించి మరీ యూనిట్ సభ్యులను తీసుకుంటున్నారు. అలాగే కొంత మంది వ్యాక్సీన్ ఫస్ట్ డోస్ లు కూడా వేసుకున్నారు. అయినా యూనిట్ లో పలువురికి కరోనా సోకినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

దాంతో షెడ్యూలు ను నిలిపివేసారు. ఈ సినిమాను మొదటి నుంచీ కరోనా వెంటాడుతోంది. కరోనా కారణంగానే అమెరికాలో చేయాల్సిన షూట్ అంతా దుబాయ్ లో చేసుకుని వచ్చారు. ఇప్పుడు మళ్లీ సమస్య. అయితే సినిమా విడుదలకు చాలా అంటే చాలా టైమ్ వుంది కాబట్టి ఫరవాలేదు.