అప్పటికే పది టేకులయ్యాయట.. డైరెక్టర్ సహనం కోల్పోయి బూతులు తిట్టడానికి రెడీగా వున్నాడట. ఇక ఫైనల్ టేక్.. యాక్షన్ అని అరవగానే ఆవిడకు శరీరంపై దురద పెట్టడం మొదలైందట. గోక్కుంటే షాట్ ఫెయిలవుతుంది.. డైరెక్టర్ గోల చేస్తాడు.
దాంతో నిమిషం నిడివి వున్న షాట్ పూర్తయ్యేవరకూ ఆ దురగ పెట్టిన నరకం అంతా ఇంతా కాదని చెబుతుంది అందాల తార అనుష్క శర్మ. ఈ సంఘటన ‘పికె’ సినిమా షూటింగ్‌లో జరిగిందట. రాజస్తాన్ ఎడారిలో కొన్ని షాట్స్ తీస్తుండగా, అక్కడ కొన్ని చెట్ల నుంచి సన్నటి ధూళి వచ్చి పడేదట. అది పడితే తట్టుకోలేనంత దురద వస్తుందట. పైగా స్లీవ్‌లెస్‌లో వుండడంతో అనుష్కకి ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
దురద పెట్టినప్పుడల్లా ఎవరికీ తెలియకుండా చాకచక్యంగా మేనేజ్ చేసిందనుకోండి.. అది వేరే విషయం. అయినా పెద్ద షాట్‌లో దురదతో మేనేజ్ చెయ్యడం అంటే చిన్న విషయం కాదు. అది అనుష్కకే చెల్లింది. ఎడారిలోని చెట్లు.. అనుష్కని అంతలా ఇబ్బంది పెట్టాయన్నమాట. సినిమా కోసం అంత కష్టపడబట్టే, ‘పీకే’ సినిమా అంత పెద్ద విజయం సాధించింది.