విష్ణుతో వీరభద్రం?

భాయ్‌ సినిమా హిట్‌ కొడుతుంది. కనీసం రెండు సినిమాలు చేతిలోకి వస్తాయనుకున్న దర్శకుడు వీరభద్రం ఆశలు అంత సులువుగా నెరవేరేటట్టులేవు. రవితేజ ఇప్పట్లో ఖాళీ లేదన్నాడు. గోపీచంద్‌ – భవ్య క్రియేషన్స్‌ కాస్త ఓకె…

భాయ్‌ సినిమా హిట్‌ కొడుతుంది. కనీసం రెండు సినిమాలు చేతిలోకి వస్తాయనుకున్న దర్శకుడు వీరభద్రం ఆశలు అంత సులువుగా నెరవేరేటట్టులేవు. రవితేజ ఇప్పట్లో ఖాళీ లేదన్నాడు. గోపీచంద్‌ – భవ్య క్రియేషన్స్‌ కాస్త ఓకె అన్న దశలో వుంది. ఈలోగా అదృష్టం బాగుండి చౌదరికి వేరే పిలుపు వచ్చింది. 

ఎవరో కాదు. మోహన్‌ బాబు.  మంచి సబ్జెక్ట్‌ వుంటే విష్ణుతో చేద్దామని అనడంతో వీరభద్రం ఇప్పుడు అదే పనిపై పడ్డాడు.మోహన్‌ బాబు కాంపౌండ్‌ లో పనిచేయడం కష్టమే అయినా, మాటలు అమ్మేయడంలో దిట్ట అయిన వీరభద్రం నెగ్గుకు వచ్చేస్తాడు. గోపీచంద్‌ లాంటి సీరియస్‌ హీరోతో కన్నా, కామెడీ పండించగల విష్ణు బెటరేమో, వీరభద్రం ట్రాక్‌ రికార్డు చూసుకుంటే.