గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం హీరోయిన్ వేట ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పడుకొనె చేత ఎస్ అనిపించాలని యూనిట్ పెద్దలు తెగ ప్రయత్నిస్తున్నారు. అది ఓ కొలిక్కి రావడం లేదు. దీపావళికి ఓ రోజు అటు ఇటుగా సినిమాకు శ్రీకారం చుట్టాలన్నది నిర్ణయం. కానీ హీరోయిన్ సంగతి ఓ కొలిక్కి రాడవం లేదు.
ఇక్కడ రెండు ఆప్షన్లు పెట్టుకుని, దీపిక కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. దీపిక ఓకె అంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. పవన్ కళ్యాణ్ పక్కన దీపిక అంటే ఇంక అభిమానులకు పట్టపగ్గాలు వుండవు. కానీ అదే ఎంతకీ తేలడం లేదు. అత్తారింటికి దారేది హిట్ ను దృష్టిలో వుంచుకుని స్క్రిప్ట్ సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేసారు.
ముఖ్యంగా అత్తారింటికి దారేది క్లయిమాక్స్ పెద్ద ప్లస్ అయినందున, ఈ సినిమాకు కూడా బలంగా వుండేలా ఫైన్ ట్యూన్ చేస్తున్నారు. పవన్ కొత్తగా ఈ సినిమా కోసం మణికొండలో తీసుకున్న ఆఫీసులోనే ఈ వ్యవహారలన్నీ నడుస్తున్నాయి. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ తదితర పనులకు కూడా ఈ కార్యాలయంలోనే ఏర్పాట్లు చేసారు. అన్నీ బాగానే వున్నాయి కానీ, దీపిక ఎస్ ఆర్ నో చెబితే తప్ప సినిమా మాత్రం సెట్ పైకి వెళ్లే సూచనలు కనిపించడం లేదు.