ఆశించిన స్థాయి ఫలితాలు రాక డీలా పడి ఉన్న ఎన్టీఆర్‌ని ఇటీవల వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్ మరింత నీరసపరిచింది. బయ్యర్లని తీవ్రంగా నష్టపరచిన ‘రామయ్యా వస్తావయ్యా’ వల్ల ఎన్టీఆర్‌పై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. తన తదుపరి చిత్రంతో అతను తప్పనిసరిగా విజయాన్ని అందుకోవాలి.
ఈసారి ఎన్టీఆర్‌కి స్టార్ డైరెక్టర్ తోడు కూడా లేదు. కందిరీగ సినిమాతో విజయవంతమైన ఒక్క సినిమా వయస్సున్న సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ యంగ్ టైగరే కావాలి. దీంతో ఈ చిత్రంపై ఎన్టీఆర్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో తన టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది తేల్చుకోడానికే ఎన్టీఆర్ మల్లగుల్లాలు పడుతున్నాడు.
ఈ చిత్రానికి ఇంకా పేరు అధికారికంగా ఖరారు చేయలేదు కానీ ఎప్పట్నుంచో మీడియా దీనిని ‘రభస’ అని పిలుస్తోంది. అయితే ఈ టైటిల్ మరీ మాస్‌గా ఉంది కాబట్టి, ఓవర్సీస్‌తో పాటు నైజాంలో కూడా టైటిల్ ప్రభావం ఉండొచ్చు కాబట్టి ‘జోరు’ అని పెడితే అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుందని అనుకుంటున్నారట. ఇంకా ఏదనేది యూనిట్ సభ్యులు తేల్చుకోలేదులెండి.