వెయ్యి వాహనాలు కాదు, 10 కార్లు

కానీ మనోజ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో మాత్రమే అత్తారింటికి వెళ్లాడు. అతడి వెంట మరో 10 కార్లు వెళ్లినట్టు తెలుస్తోంది.

ఈరోజంతా మరోసారి మంచు మనోజ్ హాట్ టాపిక్ అయ్యాడు. ఈసారి అతడు తన తండ్రి మోహన్ బాబుపై గొడవకు వెళ్లలేదు. అతడి చొక్కా ఎవ్వరూ చించలేదు. అతడి రాజకీయ రంగప్రవేశంపై ఈ రోజంతా గాసిపింగ్ నడిచింది.

మంచు మనోజ్ ఈరోజు ఆళ్లగడ్డ వెళ్లాడు. మౌనిక సొంతూరు అది. అక్కడికి వెయ్యి వాహనాలతో ర్యాలీగా వెళ్లి, గట్టిగా ప్రసంగించి, అక్కడే జనసేన పార్టీలో చేరబోతున్నట్టు మంచు మనోజ్ ప్రకటిస్తాడని అంతా ఎదురుచూశారు.

కానీ మనోజ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో మాత్రమే అత్తారింటికి వెళ్లాడు. అతడి వెంట మరో 10 కార్లు వెళ్లినట్టు తెలుస్తోంది. కూతుర్ని తొలిసారి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లానని మాత్రమే ప్రకటించిన మంచు మనోజ్.. జనసేన పార్టీలో చేరిక ఎప్పుడు అనే ప్రశ్నకు ‘నో కామెంట్’ అని మాత్రమే సమాధానమిచ్చాడు.

అయితే ప్రస్తుతానికి నో కామెంట్ అంటూ తప్పించుకున్నప్పటికీ, త్వరలోనే అతడు జనసేనలో జాయిన్ అవ్వడం పక్కా. ఎందుకంటే, మనోజ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉంది. సరైన టైమ్ వచ్చినప్పుడు, దేవుడు అనుగ్రహించినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని అతడు గతంలోనే ప్రకటించాడు.

ఇటు జనసేన పార్టీ కూడా కాస్త జనాలకు తెలిసిన మొహాల్ని పార్టీలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఎలాగూ అధికారం ఉంది కాబట్టి, మంచు మనోజ్ లాంటోళ్లు వస్తే పార్టీలో కీలక పదవి లేదా ప్రభుత్వంలో ఏదైనా మంచి నామినేటెడ్ పదవి ఇవ్వడానికి పవన్ కల్యాణ్ కు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. పైపెచ్చు మనోజ్ అంటే పవన్ కు సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది.

నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇదే రోజున మంచు మనోజ్ పార్టీలో చేరాల్సింది. కానీ అనుకోని విధంగా తండ్రితో గొడవలు మొదలయ్యాయి. ఓవైపు వివాదం నడుస్తుండగా, మరోవైపు పార్టీలో చేరడం కరెక్ట్ కాదని ఎవరో సూచించారట. అందుకే రాజకీయ రంగప్రవేశం తాత్కాలికంగా వాయిదాపడింది.

4 Replies to “వెయ్యి వాహనాలు కాదు, 10 కార్లు”

  1. This guy himself fighting for father property which doesn’t even eligible for inheritance law.

    wonder who is all in those 10 cars…probably if he gets some money as internal settlement. They will use that and orphan him again anyway

  2. ee scrap mana janasena ki avasarama? Paisa income ledu. Hit vacchi pushkaram daatindi. following ledu. Party veellaki use avadame gaani party ki veella valla paisa use ledu.

Comments are closed.