విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?

రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న నానుడి ఉంది. ఎవరైనా పదవులు వద్దు అంటే వారు రేసులో ఉన్నారనే అర్ధం.

రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న నానుడి ఉంది. ఎవరైనా పదవులు వద్దు అంటే వారు రేసులో ఉన్నారనే అర్ధం. విజయసాయిరెడ్డి రాజ్యసభకు మొదటి సారి ఎన్నికైనప్పుడు విశాఖను నోడల్ జిల్లాగా దత్తత తీసుకున్నారు. ఆ తరువాత ఆయన విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జిగా నియమితులయ్యారు.

ఆయన వ్యూహాలు ఎత్తులతో పాటు వైసీపీ ప్రభంజనం తోడై 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తం ఫ్యాన్ గాలి సునామీగా మారి ఊపేసింది. ఆ సమయంలో ఆయన విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు అన్న ప్రచారం సాగింది. అయితే అది జరగలేదు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందర కూడా విశాఖ ఎంపీగా విజయసాయిరెడ్డి అన్న మాట అయితే వినిపించింది. ఆయన నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేశారు. ఫలితం తెలిసిందే. వైసీపీ ఓటమి తరువాత మళ్లీ ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు విజయసాయిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం అప్పగించింది.

విజయసాయిరెడ్డి కూడా తన బాధ్యతలను ఒకింత ఆనందంతో తీసుకుని విశాఖ వచ్చారు. ఆయన మళ్లీ విశాఖలో ఉంటూ రాజకీయం చేయనున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్న మాట అయితే వినిపిస్తోంది

దాని మీద మీడియా అడిగిన ప్రశ్నలకు తనకు ఆ కోరిక లేదని పార్టీని విజయపధంలో నడిపించడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే ఆయన తనకు ఈ ఆలోచన లేదు అని చెప్పినప్పటికీ ఆయన గురించే అంతా తర్కించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయసాయిరెడ్డి పోటీకి దిగుతారా అన్నదే వైసీపీలోనూ ఇతర పార్టీలలోనూ చర్చగా ఉంది.

విశాఖ వైసీపీకి సరైన క్యాండిడేట్ అయితే లేరు. ఆ లోటుని భర్తీ చేస్తూ విజయసాయిరెడ్డి పోటీ చేస్తారు అన్నది అయితే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు చాలా దూరంలో ఉన్నాయి. జమిలి ఎన్నికలు అయితే దగ్గరలో ఉన్నాయి. జమిలి తోసుకుని వస్తే విజయసాయిరెడ్డి పోటీ చేయవచ్చు అన్నది అనుకుంటున్న మాట. నిజమవుతుందో కాదో ఈ రోజుకు అయితే తెలియదు అంటున్నారు.

12 Replies to “విశాఖ ఎంపీ సీటు మీద ఆయనకు మోజుందా?”

  1. విశాఖ మీద మోజు కాదు.. అక్కడున్న శాంతి మీద మోజు పడి పోయే టైం లో కూడా ‘విజయ”శాంతి”రెడ్డి’ ని పుట్టించి సొంత పెళ్ళాం కి “మనః శాంతి” కరువు చేసాడు.. పండుకోతిగాడు తూ

  2. విజయ్ సాయి, శ్రీ రెడ్డి, బోరుగడ్డ, జోజి రమేష్, సజ్జల, చెవిరెడ్డి, వీళ్ళని పెట్టుకొని జగన్ గారు ఏంచేద్దాం అని అయ్యో అయ్యో ? ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులూ కాదు ఏంటో ని ఎర్రిపుకుతనం!! ఇంకో 20 ఏళ్ళు ప్రతిపక్షమే!!

Comments are closed.