టైమ్ ఈజ్ మనీ అన్నది నానుడి. హీరోల కాల్ షీట్లే మనీ అన్నది లెటెస్ట్ సంగతి. పైగా క్రేజ్ వున్న హీరోల డేట్లు మరీ ఖరీదు. అదీకాక ఆ హీరో డేట్ లే కావాలంటే ఇంకా ఇంకా ఖరీదు.
మరో హీరో తోడు లేకుండా సినిమాలు చేయడం లేదు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్యలో కొడుకు రామ్ చరణ్ ను తోడు తెచ్చుకున్నారు. గాడ్ ఫాదర్ కోసం ఏకంగా సల్మాన్ ఖాన్ నే సాయం తీసుకున్నారు.
బాబీ డైరక్షన్ లో మైత్రీ మూవీస్ నిర్మించే వాల్తేర్ వీరయ్య (వర్కింగ్ టైటిల్) సినిమా కోసం రవితేజ ను తోడు తీసుకున్నారు. ఈ మేరకు గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ తరువాత అబ్బే అదేం లేదు అని కూడా వినిపించింది.
కాని ఇప్పుడు బేరం సెటిల్ అయిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 16 రోజులు వర్క్ చేయాల్సి వుందట. అయితే ఫుల్ రెమ్యూనిరేషన్ ఇచ్చేందుకు ఓకె అయిన తరవాతే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా రావణాసుర సినిమాకు 18 కోట్లు తీసుకున్నారు. అదే రేటును వాల్తేర్ వీరయ్య కోసం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తప్పదు సినిమా కోసం రవితేజ కావాలి అనుకున్నపుడు అడిగినంతా ఇవ్వాల్సిందే కదా? అసలే హిట్ ల కోసం ఎదురు చూస్తున్న మెగాస్టార్ కు ఈ సినిమానే ఒరిజినల్. మిగిలనవన్నీ రీమేక్ లే.