‘ఫ్యామిలీ స్టార్’ ఆంధ్ర 17 కోట్లు

దిల్ రాజు- పరుశురామ్- విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. సమ్మర్ లో మాంచి డేట్ కు విడుదల చేస్తున్నారు. Advertisement ఈ సినిమా నుంచి ఇప్పటికే…

దిల్ రాజు- పరుశురామ్- విజయ్ దేవరకొండ- మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫ్యామిలీ స్టార్. సమ్మర్ లో మాంచి డేట్ కు విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మంచి మ్యూజిక్ సెన్స్ వుంది దర్శకుడు పరుశురామ్ కు. అందువల్ల రెండు పాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి అన్ని చోట్ల. ఈ సినిమాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజినెస్ స్టార్ట్ చేసారు.

దిల్ రాజు ఎక్కువగా తన రెగ్యులర్ బయ్యర్లకే ఇస్తారు. కానీ ఓ రేటు అంటూ ఫిక్స్ చేస్తారు. ఆ విధంగా దిల్ రాజు తన ఫ్యామిలీ స్టార్ సినిమాకు ముందుగా ఆంధ్ర (సీడెడ్ నహా) ఏరియాకు 20 కోట్లు రేటు ఫిక్స్ చేసారు. ఆంధ్రలో విశాఖ ఏరియా దిల్ రాజే పంపిణీ చేసుకుంటారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు మాత్రం విక్రయిస్తారు. అయితే ఆ బయ్యర్లు అంతా ఆ రేటు కాస్త ఎక్కువ అని ఫీల్ కావడంతో 17 కోట్ల మేరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

నైజాం ఎలాగూ దిల్ రాజే పంపిణీ చేసుకుంటారు. సీడెడ్ విక్రయించేస్తారు. అంటే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ముఫై అయిదు కోట్ల మేరకు మార్కెట్ చేసినట్లు అయింది. ఇది మంచి రేటే. పైగా మంచి డేట్ కు విడుదలవుతోంది. ఫ్యామిలీ సినిమా. సమ్మర్ హాలీడేస్. సినిమా ఏమాత్రం బాగున్నా కాసుల దులువుతుంది.