పెళ్లి తర్వాత తమలో చాలా మార్పు వచ్చిందని, తమ ఆలోచన విధానం మారిందని, చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నామని చెబుతుంటారు హీరోయిన్లు. కానీ హన్సిక మాత్రం అలా చెప్పడం లేదు.
పెళ్లి తర్వాత తన లైఫ్ ఏం మారలేదంటోంది ఈ బ్యూటీ. పెళ్లికి ముందు ఎలా ఉందో, పెళ్లి తర్వాత కూడా అలానే ఉందని, ఎటొచ్చి తన అడ్రస్ మాత్రం మారిందని చెబుతోంది.
“పెళ్లి తర్వాత ఏం మారలేదు. షూటింగ్ టైమ్ లో క్యారెక్టర్ లో ఉంటాను. ఇంటికెళ్లిన తర్వాత భర్తతో ఉంటాను. అంతే తేడా. సాయంత్రం 6 తర్వాత అతడికే టైమ్ కేటాయిస్తాను. పెళ్లి తర్వాత నా అడ్రెస్ మాత్రమే మారింది. నా ఇంటి పేరు కూడా మారలేదు. హన్సిక మోత్వానీ అనే ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను. అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదు.”
ఇలా పెళ్లి తర్వాత తనలో ఎలాంటి మార్పుచేర్పులు చోటుచేసుకోలేదని చెబుతోంది హన్సిక మోత్వానీ. ఆమె నటించిన మై నేమ్ ఈజ్ శృతి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం కోసం ఆమె హైదరాబాద్ వచ్చింది.