గతంలోనే ఈమె ఒక అదర చుంభన సన్నివేశంలో నటించింది. ఇప్పుడు కాదు.. ఎప్పుడో 'తకిట తకిట' అనే సినిమాలోనే ఈమె ఆ సినిమా హీరోతో ముద్దు సన్నివేశంలో మునిగి తేలింది. సుదీర్ఘ చుంభన సన్నివేశంలో నటించింది. తనే హరి ప్రియ. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ముద్దు సన్నివేశాల పట్ల విరక్తిని వ్యక్తం చేస్తూ ఉంది. సినిమాలంటే కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా ఉండాలని అంటోంది.
తాజాగా ఒక కన్నడ సినిమాలో తను రొమాంటిక్ సీన్లో నటించింది అయితే వాస్తవమే అని, అయితే అది మూతి ముద్దు కాదని హరిప్రియ చెబుతూ ఉంది. కన్నడ నటి రష్మిక తెలుగులో గీతాగోవిందం సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో నటించడం అక్కడ పెద్ద దుమారం రేపింది. అప్పటికే ఎంగేజ్డ్ అయిన రష్మిక అలా నటించడంపై కన్నడీగులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆమె ఆ ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది. అది వేరే కథ.
ఇప్పుడు హరి ప్రియ దెప్పి పొడుస్తూ ఉంది. తను నటించిన ముద్దు సన్నివేశం రష్మిక చేసిన లాంటిది కాదని చెప్పుకొస్తోంది. అయితే రష్మిక కన్నా చాలా సంవత్సరాల ముందే హరిప్రియ అలాంటి సన్నివేశంలో జీవించేసింది. ఇప్పుడు మాత్రం కుటుంబ సమేతం, సీన్ డిమాండ్ చేయడం అని అంటోంది!