Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ పుట్టినరోజు.. జతగా అనుష్క?

ప్రభాస్ పుట్టినరోజు.. జతగా అనుష్క?

ఈ నెలలోనే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు హీరో ప్రభాస్. గడిచిన మూడేళ్లుగా సినిమా సెట్స్ లోనే ప్రభాస్ పుట్టినరోజు జరిగింది. అది లేనప్పుడు ఇంట్లోనే నిరాడంబరంగా తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ హీరో. అయితే ఈసారి పుట్టినరోజుకు మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయి.

ఈ పుట్టినరోజుతో 40వ వడిలోకి ప్రవేశిస్తున్నాడు ప్రభాస్. పైగా పుట్టినరోజుకు కొన్నిరోజుల ముందు లండన్ లో ఈవెంట్ కు వెళ్తున్నాడు. ఈనెల 19న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో బాహుబలి స్కోర్ లైవ్ కాన్సెర్ట్ ఉంది. సంగీత దర్శకుడు కీరవాణి ఆధ్వర్యంలో జరగనున్న ఈ లైవ్ కన్సర్ట్ కు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క వెళ్తున్నారు. అక్కడికి మరో 4 రోజుల్లో ప్రభాస్ తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు.

సో.. లండన్ లో ఈవెంట్ తర్వాత ప్రభాస్ మరో వారంరోజుల పాటు అక్కడే ఉండి తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటాడంటున్నారు. మరికొందరు మాత్రం పుట్టినరోజు టైమ్ కు అతడు హైదరాబాద్ వచ్చేస్తాడని అంటున్నారు. ఈ మొత్త ఎపిసోడ్ లో అనుష్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లండన్ లో ఈవెంట్ తర్వాత అనుష్క కూడా ప్రభాస్ తోనే ఉంటుందా లేక వెనక్కి వచ్చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభాస్-అనుష్క రిలేషన్ షిప్ పై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ప్రభాస్ ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నాడు. ఈసారి ప్రభాస్ తో పాటు అనుష్క కూడా లండన్ లోనే ఉండిపోతే మాత్రం పుకార్లు మరోసారి ఊపందుకోవడం ఖాయం. 

పీవీపీ వర్సెస్ బండ్ల ఏది నిజం? ఏది అబద్దం?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?