బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలో ఒకరైన కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. 'తన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నానంటూ అందుకోసమే ట్విట్టర్ కు వీడ్కోలు' పలుకుతున్నట్లు ట్వీట్టర్ లో ఫోస్ట్ చేశారు.
నటుడిగా బాలీవుడ్లో ఏంట్రీ ఇచ్చిన కరణ్ జోహార్ ఆ తర్వాత కుచ్ కుచ్ హోతా హై మూవీ తో డైరెక్టర్ గా మారాడు. కరణ్ దర్శకత్వం వహించిన చాల సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఈ మధ్యకాలంలో దర్శకత్వం పక్కకు పెట్టి నిర్మాతగాను, రియాల్టీ షోలకు యాంకర్ గా చేస్తున్నారు. బాలీవుడ్‌లో పాపులర్ షో అయిన కాఫీ విత్ కరణ్ 7వ సీజన్ దిగ్విజయంగా జరుగుతోంది.
బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఎక్కువగా వారసుల పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారనే అపవాదు ఉంది. అలాగే సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ సీని అభిమానులకు కరణ్ టార్గెట్ అవుతున్నారు. ఏ బాలీవుడ్ సినిమా వచ్చిన ట్వీట్టర్ లో 'బాయికాట్ బాలీవుడ్' అనేదే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. బహుశా తన ట్వీట్టర్ ఖాతాలో ఎటువంటి ఫోస్ట్ చేసిన పాజిటివ్ కంటే నెగెటివ్ కామెంట్స్ నే ఎక్కవ వస్తుండటంతో ట్వీట్టర్ కు గూడ్ బై చెప్పినట్లు కనిపిస్తుంది.