బాలకృష్ణకు ఎందుకింత పొగరు?

బాలయ్య తననుతానే కీర్తించుకున్నారు. “నా కీర్తి.. నా కిరీటం” అంటూ భారీ డైలాగులు చెప్పారు.

చాలామంది బాలకృష్ణకు పొగరు అంటారు. ఆయన ఎవ్వరి మాట వినరని, ఏం చూసుకొని అంత పొగరు అని ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్నలకు వేరే ఎవరో సమాధానం చెబితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్వయంగా బాలయ్య సమాధానమిచ్చాడు.

“ఎవ్వర్ని చూసి బాలకృష్ణకు ఇంత పొగరు అని అంటుంటారు. నన్ను చూసుకునే నా పదునైన పొగరు అంటాన్నేను. ఏం చూసుకొని బాలకృష్ణకు ఇంత ధైర్యం అంటారు. నాపై నాకున్న నమ్మకం, నా ఆలోచనలు, నా వైబ్రేషన్లే నా ధైర్యం.”

ఇలా తనకుతాను సెల్ఫ్ బ్రాండింగ్ ఇచ్చుకున్నారు బాలకృష్ణ. “నేను ఎవ్వరితోనూ పోల్చుకోను, నా రూటే వేరు. నా మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. ఒకరి కీర్తిని నా తల మీద మోయను నేను. ఓ మహారాజుగా నన్ను నేను మలుచుకున్నాను.” అనేది ఆయన మాట.

డాకు మహారాజ్ సినిమా ఫంక్షన్ లో ఇలా తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకున్నాడు బాలయ్య. హీరోలను అభిమానులు, దర్శక-నిర్మాతలు పొగడటం కామన్. ఫర్ ఏ ఛేంజ్.. బాలయ్య తననుతానే కీర్తించుకున్నారు. “నా కీర్తి.. నా కిరీటం” అంటూ భారీ డైలాగులు చెప్పారు.

డాకు మహారాజ్ కథ వెనక తన ప్రమేయం ఉన్నట్టు ప్రకటించుకున్నారు బాలకృష్ణ. ఆదిత్య-369లో ఉన్న ఓ గెటప్ నుంచి కథ అల్లమని చెప్పి, స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని దగ్గరుండి కథ రాయించుకున్నానని ప్రకటించుకున్నారు. ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఈ కథ ఎలా ఉందో 12వ తేదీన తెలిసిపోతుంది.

11 Replies to “బాలకృష్ణకు ఎందుకింత పొగరు?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. మా “లెవెన్ మోహన” సింగల్ గా సంపాదించుకున్న కీర్తి, కిరీటం, పొగరు కంటే ఎక్కువా నీకు??

    “జనం గుంపులుగా వచ్చి మా సింగల్ సింహం” పొగరు 11కి దింపి బెంగళూరు పారిపోయేలా చేశారు.

  3. మరి ఒకడు నాకు శాలువాలు కప్పలి, అవార్డ్లు ఇవ్వాలి అని సొంత డబ్బా ఏసుకున్నప్పుడు ఇట్ఠా రాయకుంటువే?

Comments are closed.