ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి కాలం కలిసి రావడం లేదు. ముఖ్యమంత్రి అయ్యాననే సంతృప్తి తప్ప, మిగిలిన విషయాల్లో ఆయనకు ఎలాంటి ఆనందం లేదన్న మాట వినిపిస్తోంది. రాజకీయంగా పట్టు కోల్పోయారనే సంగతి మొదట్లోనే జనానికి అర్థమైంది. అధికార యంత్రాంపై కూడా పూర్తిగా పట్టుపోయిందనే చేదు నిజం… రెండు రోజుల క్రితం టీటీడీ ఈవో శ్యామలరావు ఘాటు స్పందనతో లోకానికి తెలిసొచ్చింది.
శ్యామలరావుకు వ్యక్తిగతంగా సౌమ్యుడనే పేరు వుంది. అలాంటి అధికారే చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి గట్టిగా క్లాస్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సహజంగా కుటుంబ పెద్ద క్రమశిక్షణతో వుంటే, కుటుంబంలోని మిగిలిన సభ్యులు గౌరవ మర్యాదలతో మెలుగుతారు. కుటుంబ యజమాని తప్పులు చేస్తుంటే, మిగిలిన సభ్యులు గౌరవించరనే సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. చంద్రబాబునాయుడు తమతో తప్పులు చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులకు అర్థమైతే, వాళ్లు గౌరవంగా మెలిగే అవకాశం వుండదు. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులు పెద్దరికంతో, నిజాయితీగా ప్రవర్తిస్తే, ప్రజలైనా, అధికారులైనా గౌరవిస్తారు. తమ స్వార్థానికి వాడుకుంటున్నారని తెలిస్తే, ఎవరైనా ఎందుకు గౌరవిస్తారు. లెక్క చేయకుండా తమ పని తాము చేసుకెళ్తారు.
చంద్రబాబు విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. టీటీడీలో చంద్రబాబు ఏం చేశారో, చేయించారో అందరికంటే, కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులకు బాగా తెలుసు. అందుకే వాళ్ల రియాక్షన్ కూడా ఆ రేంజ్‌లోనే వుంటుంది. ప్రజల మధ్య ఈవో శ్యామలరావును దబాయించిన చంద్రబాబు.. ఇన్నర్ మీటింగ్‌లో ఎందుకని అడ్డుకోలేకపోయారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పొలిటికల్ గవర్నమెంట్ పేరుతో చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు గతంలో మాదిరిగా ఏ యంత్రాంగంపై కూడా పట్టులేకుండా పోయింది. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదే మరి!
టీటీడీ EO వెనుకబడిన కులం యాదవ సామజిక వర్గానికి చెందిన వ్యక్తి .
చంద్రిక , బ్రా నాయుడు అగ్రకులం కమ్మ కులానికి చెందిన వ్యక్తులు.
ఆ మాత్రం కుల ఆధిపత్యం లేకపోతె ఎలా ?
Chandrika ఎవరు?
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Tdp government evariki upayogam leni party only business people ki upayogam