పవన్, మహేష్ వల్ల రూ.100 కోట్లు నష్టం

ఈరోజుల్లో పెద్ద సినిమాలకు రెండేళ్లు, మూడేళ్లు పడుతుంది. కానీ ఆ రోజుల్లో సినిమాకు మ్యాగ్జిమమ్ ఏడాదికి మించి పట్టేది కాదు.

సినిమాల్లో నిర్మాతకు వంద కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే వామ్మో అని కళ్లు తేలేస్తాం. మరి అదే వంద కోట్ల రూపాయల నష్టం, 15 ఏళ్ల కిందటే వస్తే..? ఊహకు కూడా అందని ఇలాంటి భారీ నష్టాన్ని చవిచూశానంటున్నారు నిర్మాత శింగనమల రమేష్.

మహేష్ బాబుతో తీసిన ఖలేజా సినిమా.. పవన్ కల్యాణ్ తో నిర్మించిన కొమరం పులి సినిమాలు తనకు వంద కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టాయని ఆయన బహిరంగంగా వెల్లడించారు.

“ఈరోజుల్లో పెద్ద సినిమాలకు రెండేళ్లు, మూడేళ్లు పడుతుంది. కానీ ఆ రోజుల్లో సినిమాకు మ్యాగ్జిమమ్ ఏడాదికి మించి పట్టేది కాదు. అలాంటిది నా బ్యాడ్ లక్ ఏంటంటే, నాకు ఒక మూడేళ్లు పట్టింది. ఖలేజా, కొమరం పులి సినిమాల వల్ల నాకు వంద కోట్లు నష్టం వచ్చింది.”

ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్, మహేష్ బాబు నుంచి తనకు ఎలాంటి సపోర్ట్ అందలేదని.. కనీసం అయ్యో-పాపం అని చెప్పి ఫోన్ కూడా చేయలేదని ఆరోపిస్తున్నారు రమేష్.

తన 2 సినిమాలు లేట్ అవ్వడానికి కారణాలు కూడా వెల్లడించారు శింగనమల రమేష్. కొమరం పులి సినిమా నిర్మిస్తున్నప్పుడు పవన్ కల్యాణ్, ప్రజారాజ్యం పార్టీ పనులు పెట్టుకున్నారని, అందుకే ఆ సినిమా లేట్ అయిందన్నారు. దీంతో పాటు మరెన్నో కారణాల వల్ల కొమరం పులితో పాటు, ఖలేజా సినిమా నిర్మాణం లేటైందన్నారు.

శింగనమలపై విమర్శల వర్షం.. ప్రస్తుతం శింగనమలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. ఈయన కామెంట్స్ పై బండ్ల గణేశ్ స్పందించారు. శింగనమల సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల పవన్ కల్యాణ్, మూడేళ్ల పాటు మరో సినిమా చేయకుండా వందల కాల్షీట్లు వేస్ట్ చేసుకున్నారని, తను ప్రత్యక్ష సాక్షినని అన్నారు.

అటు మహేష్ ఫ్యాన్స్ కూడా కౌంటర్లు స్టార్ట్ చేశారు. ఖలేజా సినిమాకు అప్పట్లో 30 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే, శింగనమలకు అంతకుమించి నష్టం ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

3 Replies to “పవన్, మహేష్ వల్ల రూ.100 కోట్లు నష్టం”

Comments are closed.