తండేల్ సక్సెస్ అక్కడే వుంటుంది

తండేల్ సినిమా ఎలా వుండబోతోంది. సంక్రాంతి సినిమాల తరువాత వస్తున్న ఈ సినిమా మీద జరుగుతున్న డిస్కషన్ లో కీలక పాయింట్ ఇది.

తండేల్ సినిమా ఎలా వుండబోతోంది. సంక్రాంతి సినిమాల తరువాత వస్తున్న ఈ సినిమా మీద జరుగుతున్న డిస్కషన్ లో కీలక పాయింట్ ఇది. తండేల్ సినిమా కథ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ట్రయిలర్ లోనే చెప్పేసారు. దర్శకుడు చందు మొండేటి, హీరో చైతన్య కూడా తమ తమ ఇంటర్వ్యూల్లో ఈ విషయాలు వివరంగా చెప్పేసారు. అందువల్ల ఈ సినిమా ఎలా వుంటబోతోంది అన్న డిస్కషన్ లో పలు పాయింట్లు దొర్లుతున్నాయి. అందులో కీలకమైన పాయింట్ ఒక్కటే.

తొలిసగం ఎలా వుండబోతోంది. ఎందుకంటే ఇంట్రవెల్ బ్యాంగ్ ఏమిటన్నది తెలిసిపోయింది. తండేల్ అండ్ టీమ్ పాక్ సైనికులకు దొరికిపోవడం. సముద్రంలో తీసిన ఈ ఎపిసోడ్ ఎలాగూ హైలైట్ గా వుంటుంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్ మాదిరిగా వుంటుంది. అందులో సందేహం లేదు. ఆ సీన్ తరువాత నుంచి పాక్ జైలు సన్నివేశాలు.. ఇటు మత్స్యకార గ్రామంలో సన్నివేశాలు, హీరో, హీరోయిన్, విరహం ఇవన్నీ కలిసి ఎమోషన్ హై ఎలాగూ ఇస్తాయి. హీరో ను పాక్ జైలు నుంచి తప్పించడానికి హీరోయిన్ చేసే కృషి, ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్ ఉత్కంఠ ఎలాగూ ఆసక్తికరంగా వుంటాయి.

కానీ అది కాదు పాయింట్. సినిమా ప్రారంభం నుంచి విశ్రాంతి బ్యాంగ్ వరకు ఎలా నడిపి వుంటారు. ఫిషర్ మెన్, వారి జీవనశైలి, సముద్రంలో వేట ఒక లేయర్. రాజు-సత్యల లవ్ ట్రాక్ మరో లేయర్. కేవలం ఈ రెండు ట్రాక్ లతో దాదాపు గంట సినిమా నడపాలి. అందులో రెండు పాటలు కొంత కవర్ చేస్తాయి. మిగిలిన లవ్ ట్రాక్ అంతా స్వీట్ నథింగ్స్ తో నడపాలి. బోర్ కొట్ట కూడదు. రిపీట్ అనిపించకూడదు. ఇక్కడ దర్శకుడి చాకచక్యం ఆధారపడి వుంటుంది. చందు మొండేటి దీన్ని ఎలా డీల్ చేసారు అన్నది ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా వుంది.

ఇక్కడ సినిమా పాస్ అయితే టోటల్ గా ఓకె అనిపించేసుకుంటుంది.

2 Replies to “తండేల్ సక్సెస్ అక్కడే వుంటుంది”

Comments are closed.