నాగచైతన్య, సాయి పల్లవి కాంబో మూవీ ‘తండేల్’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో హీరో చైతన్య విలేకరుల సమావేశంలో ‘తండేల్’ విశేషాలు పంచుకున్నారు.
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టోరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సెకండ్ హాఫ్ అయితే యూనానిమస్‌గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముప్పై నిమిషాలు వెరీ సాటిస్ఫైయింగ్. క్లైమాక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది.
దూత సమయంలో ఈ కథ విన్నాను. మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీలా అనిపించింది. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి వచ్చేలా వర్క్ చేసిన తర్వాత అద్భుతంగా వచ్చింది.
పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ల లైఫ్‌స్టైల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్లను నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక, నేను చేయగలనని కన్విన్స్ అయిన తర్వాత జర్నీ మొదలైంది.
ప్రతి సినిమాతో ఇంకా బెటర్ అవ్వాలని ప్రతి యాక్టర్‌కి ఉంటుంది. అయితే, ఈ కథ రియల్ లైఫ్ క్యారెక్టర్ కావడంతో ఇంకా మోటివేట్ అయ్యాను. యాక్టర్‌గా నెక్స్ట్ స్టెప్ వెళ్లే అవకాశం ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ చాలెంజింగ్‌గా అనిపించింది.
చందుతో నాకు ఇది మూడో సినిమా. తనతో ట్రావెల్ అవ్వడం ఇష్టం. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్‌గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు.
‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ వెనుక మిగతా లేయర్స్ ఉంటాయి. ఇందులో సాయి పల్లవి ఫాంటాస్టిక్ యాక్టర్. పల్లవితో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. క్యారెక్టర్‌ని డీప్‌గా అర్థం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా ఉంటే, మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది.
దేవి ఇచ్చిన ‘బుజ్జితల్లి’ పాట సినిమాను గ్రౌండ్ లెవల్‌లోకి తీసుకెళ్లిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దేవితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. తనతో చేసిన ప్రతి సినిమా ఆడియో సూపర్ హిట్.
Nine, nine, eight, nine, zero, six, four, two, five, five :- CB work