షూట్ మొదలైంది.. పవన్ కు జ్వరమొచ్చింది

పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. కేవలం జ్వరం మాత్రమే కాదు, ఆయన స్పాండిలైటిస్ తో కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.

హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వచ్చింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా టోటల్ షూటింగ్ పూర్తయిపోతుందని, చెప్పిన టైమ్ కు మూవీ థియేటర్లలోకి వస్తుందని సంబర పడ్డారు.

కట్ చేస్తే, ఈరోజు సెట్స్ పైకి పవన్ కల్యాణ్ రాలేదు. దీనికి కారణం ఆయనకు జ్వరం. పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. కేవలం జ్వరం మాత్రమే కాదు, ఆయన స్పాండిలైటిస్ తో కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది.

తాజా అస్వస్థత కారణంగా రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ కు ఆయన హాజరు కాలేకపోవచ్చు అంటూ తెలిపింది. అంటే దీనర్థం, ఆయన షూటింగ్ కు కూడా హాజరుకాలేరు.

మరోవైపు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ మొదలైనట్టు టీమ్ ప్రకటించింది. సునీల్, రఘుబాబు, నాజర్ లాంటి ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు తీయడంతో పాటు.. ఈరోజు సెట్స్ లో నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు వేడుకలు కూడా సెలబ్రేట్ చేశారు.

అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ కోలుకోవడానికి కనీసం మరో 3-4 రోజులైనా పట్టేలా ఉంది. అప్పటికి ఆయన పూర్తిచేయాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలు గుట్టలా పేరుకుపోయి ఉంటాయి. వాటికే ఆయన తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే హరిహర వీరమల్లు షూటింగ్.

11 Replies to “షూట్ మొదలైంది.. పవన్ కు జ్వరమొచ్చింది”

  1. Get well soon pawan sir. State affairs have come to a standstill because you are missing. Entire state is missing you now. Your energy is the only thing running the state right now. Wish to see you in DCM chair now and CM chair in the future. Jai Janasena.

  2. ఎప్పుడో ఇచ్చిన వాటికి సంబంధం లేదు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవ్వాలి….. లేకపోతే జొరాలు వచ్చేస్తాయి

  3. ప్లే బాయ్ వర్క్ వుంది :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. ఎంతసేపు పవన్ మీద పడి ఏడవడం మానేసి అప్పుడపుడు కొంచెం మంచి విషయాలు కూడా చెప్పు బ్రొకరంధ్ర🤣

Comments are closed.