మళ్లీ సీనియర్ హీరోలే దిక్కు

గోపీచంద్ మలినేని సీనియర్ హీరోలు రవితేజ, బాలకృష్ణ లతో రెండు హిట్ లు కొట్టారు. బాబి మెగాస్టార్ తో హిట్ కొట్టారు. ఇద్దరు యంగ్ డైరక్టర్లు రెండు బ్లాక్ బస్టర్లు కొట్టినా ఒక్క యంగ్…

గోపీచంద్ మలినేని సీనియర్ హీరోలు రవితేజ, బాలకృష్ణ లతో రెండు హిట్ లు కొట్టారు. బాబి మెగాస్టార్ తో హిట్ కొట్టారు. ఇద్దరు యంగ్ డైరక్టర్లు రెండు బ్లాక్ బస్టర్లు కొట్టినా ఒక్క యంగ్ హీరో దగ్గర నుంచి కూడా పిలుపు రాలేదు. అదే ఆశ్చర్యం. మళ్లీ ఇద్దరూ సీనియర్ హీరోల వైపే చూడాల్సిన పరిస్థితి. 

గోపీచంద్ మలినేని మెగాస్టార్ వైపు చూస్తున్నారు. బాబి యేమో బాలకృష్ణ వైపు చూస్తున్నారు. ఇద్దరు డైరక్టర్ లు తీసినవి మాస్, ఎమోషనల్, యాక్షన్ ఎంటర్ టైనర్లే. యంగ్ హీరోలు కూడా ఇలాంటి సినిమాల వైపే చూస్తారు. మరి ఎందుకని ఈ ఇద్దరికీ పిలుపు రాలేదు అంటే ఒకటే సమాధానం. 

పాన్ ఇండియా సినిమాల మీద వున్నారు మన యంగ్ హీరోలంతా. బహుశా అందుకే వీళ్ల మీద దృష్టి పడి వుండకపోవచ్చు.

గోపీచంద్ ఇప్పుడు అయితే మెగాస్టార్ తో తీయాలి లేదంటే మరోసారి రవితేజతో వెళ్లాలి. బాబి ఇప్పుడు బాలయ్య తో సెట్ చేసుకోవాలి లేదంటే రవితేజ వైపు వెళ్లాలి. గోపీచంద్ కు పవన్ కళ్యాణ్ తో చేయాలని వుంది కానీ కుదరడం లేదు. చూస్తుంటే తెలుగు దర్శకులకు చాయిస్ లు లిమిట్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది.