నిఖిల్ మరో స్పెషల్ మూవీ

కార్తికేయ సిరీస్ తో మాంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు హీరో నిఖిల్. ఈసారి ఒప్పుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వున్నాడు. ఇప్పటికే 18 పేజీస్, స్పై సినిమాలు ముందుగా ఓకె చేసినవి వున్నాయి. ఇవి…

కార్తికేయ సిరీస్ తో మాంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు హీరో నిఖిల్. ఈసారి ఒప్పుకునే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వున్నాడు. ఇప్పటికే 18 పేజీస్, స్పై సినిమాలు ముందుగా ఓకె చేసినవి వున్నాయి. ఇవి కాక ఓ పీరియాడికల్ మూవీకి ఓకె చెప్పాడు. అర్జున్ సురవరం సినిమాను అందించిన టాగోర్ మధునే ఈ సినిమాకూ నిర్మాత.

ఓ వైవిధ్యమైన పీరియాడికల్ ఫాంటసీ కథను నిఖిల్ కు చెప్పించడం, ఓకె అనడం జరిగిపోయింది. ప్రస్తుతం చేతిలో వున్న రెండు సినిమాలు అయిపోతే ఆ సినిమా మీదకు వెళ్తాడు. 18 పేజీస్ ఈనెలలో విడుదలకు రెడీ అవుతోంది. స్పై సినిమా సెట్ మీద వుంది. ఓ కొత్త దర్శకుడు పని చేసే టాగో్ర్ మధు సినిమా జనవరి తరువాత ప్రారంభం అవుతుంది.

ఈ కొత్త సినిమా కూడా పలు లాంగ్వేజెస్ లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. సబ్జెక్ట్ పరంగా లాంగ్వేజ్ బారియర్స్ లేనందున పాన్ ఇండియా లెవెల్ లో కాస్త భారీగానే తీయడానికి ప్రీ పొడక్షన్ పనులు ప్రారంభించేసారు. స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ మాత్రం సెట్ చేయడానికి కొంచెం టైమ్ పడుతుంది.