షారూక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. మొదటి రోజు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగడం, కనీవినీ ఎరగని రీతిలో స్క్రీన్స్ కేటాయించడంతో తొలి రోజునే వరల్డ్ వైడ్ వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది పఠాన్ మూవీ.
ఇండియాలో ఈ సినిమా హిందీ వెర్షన్ కు మొదటి రోజు 51 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. తన తొలి రోజు రన్ తో పఠాన్ సినిమా, హృతిక్ నటించిన వార్ ను (మొదటి రోజు 50 కోట్లు) అధిగమించింది. అయితే కేజీఎఫ్-2 (హిందీ వెర్షన్)ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. కేజీఎఫ్-2 హిందీకి మొదటి రోజు 52 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.
అటు ఓవర్సీస్ లో కూడా పఠాన్ కు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. యూఎస్ లో ఇప్పటికే ఈ సినిమా మిలియన్ మార్క్ దాటేసింది. అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ లో నంబర్ వన్ మూవీగా అవతరించింది.
రిపబ్లిక్ డే హాలిడే కూడా కలిసిరావడం, ఈ వీకెండ్ ఇండియన్ మార్కెట్లో మరో బడా సినిమా పోటీగా లేకపోవడంతో పఠాన్ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
లాంగ్ గ్యాప్ తర్వాత షారూక్ నటించిన సినిమా కావడంతో పఠాన్ చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సిద్దార్థ్ ఆనంద్ డైరక్ట్ చేశాడు. సల్మాన్ ఖాన్ గెస్ట్ ఎప్పీయరెన్స్ కూడా ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ అయింది.