సినిమా రిలీజైంది.. పాట మిస్సయింది

సాంకేతిక కారణాల వల్ల ‘నానా హైరానా’ సాంగ్ ను సినిమాలో పెట్టలేకపోయారంట.

శంకర్ సినిమాల్లో పాటలు హైలెట్. సినిమా ఎలా ఉన్నా, పాటలు మాత్రం నిరాశపరచవు. అలాంటి శంకర్ సినిమా నుంచి ఓ పాట మిస్సయితే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా విజువల్ వండర్ అనిపించే సాంగ్ తెరపై కనిపించకపోతే ఎలా ఉంటుంది?

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘నానా హైరానా’ అనే సాంగ్ మిస్సయింది. ఈరోజు ఉదయం 4 గంటల ఆటకు ఆశతో వెళ్లిన ప్రేక్షకులకు తెరపై ఆ సాంగ్ కనిపించలేదు. ఓ షో పూర్తయిన తర్వాత చావుకబురు చల్లగా చెప్పారు.

సాంకేతిక కారణాల వల్ల ‘నానా హైరానా’ సాంగ్ ను సినిమాలో పెట్టలేకపోయారంట. సంక్రాంతి కానుకగా 14వ తేదీ నుంచి ఆ పాటను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఇండియాలోనే తొలిసారిగా ఇన్ ఫ్రారెడ్ కెమెరా వాడి షూట్ చేసిన సాంగ్ అది. అలా షూట్ చేసిన ఇన్ ఫ్రారెడ్ ఇమేజెస్ ను ప్రాసెస్ చేయడం యూనిట్ కు కష్టంగా మారిందంట. అందుకే సకాలంలో ఆ సాంగ్ ను అందించలేకపోయారని చెబుతున్నారు.

గేమ్ ఛేంజర్ లో ఉన్న ఒకే ఒక్క మెలొడీ ఇది. కార్తీక్, శ్రయా ఘోషల్ ఆలోపించిన ఈ పాటకు 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడీ విజువల్ వండర్ ను తెరపై చూడాలంటే, 14వ తేదీ వరకు ఆగాల్సిందే.

9 Replies to “సినిమా రిలీజైంది.. పాట మిస్సయింది”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.