తిరుపతిలో తొక్కిసలాట దుర్ఘటనతో టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రుల సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తీవ్రస్థాయిలో వాగ్వాదం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వాళ్లిద్దరూ కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అనే రేంజ్లో వాదులాట జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదే సందర్భంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలిపై కూడా చర్చకు రావడం, ఆ తర్వాత మాట్లాడుకుందామని సీఎం అనడం గమనార్హం.
టీటీడీలో పరిపాలన సక్రమంగా సాగాలంటే చైర్మన్, ఈవో, అదనపు ఈవో మధ్య మంచి సమన్వయం వుండాలి. వాళ్ల మధ్య ఏ మాత్రం తేడా వచ్చినా.. టీటీడీ పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడీ దుర్ఘటనకు వాళ్ల మధ్య సమన్వయం లేకపోవడమే ఒక కారణమని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా బీఆర్ నాయుడు, వెంకయ్య చౌదరి ప్రభుత్వం తమదని, తాము చెప్పినట్టుగా నడవాలని, టీటీడీ అంటే తమ సామ్రాజ్యంగా భావిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈవో శ్యామలరావును లెక్కలేని తనంతో చూడడం, ఆయన రివర్స్ కావడంతో టీటీడీలో జరగకూడనవన్నీ జరుగుతున్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమలకు వెళ్లిన చంద్రబాబునాయుడు… తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పరస్పరం కత్తులు నూరుకుంటున్న టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో టీమ్‌తో ప్రక్షాళన సంగతేమో గానీ, భక్తుల భక్షాళన జరుగుతోందనే విమర్శలకు అవకాశం ఇచ్చారు.
నిజంగా తిరుమల వెంకన్నపై ఏ మాత్రం భక్తిభావన ఉన్నా, ఈ ముగ్గురిపై వేటు వేయాలని భక్తులు కోరుకుంటున్నారు. లేదంటే టీటీడీ ఏమవుతుందో అనే ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతోంది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
వెంటనే వాళ్ళని పీకి పడేసి కొత్త వాల్లను పెట్టాలి
Cbn ni kudaaa peekandi rashtrapathi palana pettandi
మావోడైతే ప్రతీ ఊరిలో
“వీధికొక వైకుంఠద్వారం సెట్టింగ్” వేయించి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకునేవాడు
లక్షలక్షలు సాలరీస్ తీసుకొని వర్క్ సరిగ్గా చేయడం లేదు carless ఎక్కువ అయ్యిది
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు