రాజాసాబ్ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని లుక్స్ వచ్చాయి. రీసెంట్ గా ప్రభాస్ నుంచి గ్రే షేడ్స్ తో కూడిన లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే దానిపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వచ్చింది.
ఈ విషయాన్ని నిర్మాత విశ్వప్రసాద్ అంగీకరించారు కూడా. పూర్తిగా గ్రాఫిక్స్ పై ఆధారపడి మోషన్ పోస్టర్ ను డిజైన్ చేయడం, ప్రభాస్ ఫొటో అందులో కలిసిపోవడంతో కొంతమంది నిరుత్సాహపడిన మాట వాస్తవమని అంగీకరించాడు.
ఇప్పుడీ సినిమాపై మరింత క్లారిటీ రాబోతోంది. క్రిస్మస్ కు రాజాసాబ్ టీజర్ విడుదల చేయబోతున్నారు. మారుతి దర్శకత్వంలో కామెడీ హారర్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రిస్మస్ కు ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే ఇంత పెద్ద హారర్ సినిమా ఎప్పుడూ రాలేదంటున్నాడు నిర్మాత. మరోవైపు దర్శకుడు మాత్రం ప్రభాస్ ను డార్లింగ్ గా చూపిస్తున్నామని, కామెడీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడు. ఇవన్నీ ఒకే సినిమాలో ఎలా మిక్స్ అవుతాయో చాలామందికి అర్థం కావడం లేదు.
నిర్మాత మాత్రం రిలీజ్ కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అసలైన కంటెంట్ చూస్తారని, ‘రాజా సాబ్’ కోసం ప్రత్యేకమైన ప్రచార వ్యూహాన్ని అనుసరించబోతున్నామని అంటున్నాడు. వీళ్ల ప్రచార వ్యూహం ఏంటో, రాజాసాబ్ అసలైన కంటెంట్ ఏంటో.. క్రిస్మస్ కు వచ్చే టీజర్ తో కొద్దిపాటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ థియేటర్లలోకి వస్తుంది.
MUDURU GADI MOVIES ANNI THALANIPPI MOVIES
Call boy jobs available 7997531004