రిటైర్మెంట్ ప్రకటించిన టాలెంటెడ్ నటుడు

నటీనటులకు రిటైర్మెంట్ ఉంటుందా..? అవకాశాలు వచ్చినన్నాళ్లు సినిమాలు చేస్తారు.. హీరోగా ఛాన్స్ రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతారు.. అది కూడా రాకపోతే సైడ్ క్యారెక్టర్స్ చేస్తారు.. మొత్తానికి సినిమాల్లోనే ఉంటాను. కానీ విక్రాంత్ మెస్సీ…

నటీనటులకు రిటైర్మెంట్ ఉంటుందా..? అవకాశాలు వచ్చినన్నాళ్లు సినిమాలు చేస్తారు.. హీరోగా ఛాన్స్ రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతారు.. అది కూడా రాకపోతే సైడ్ క్యారెక్టర్స్ చేస్తారు.. మొత్తానికి సినిమాల్లోనే ఉంటాను. కానీ విక్రాంత్ మెస్సీ అనే నటుడు మాత్రం సినిమాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

గడిచిన కొన్నేళ్లుగా అందరి ప్రశంసలు అందుకున్న నటుడు విక్రాంత్ మెస్సే. “12th ఫెయిల్” అనే సినిమా ఇతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. కటిక పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి కష్టపడి ఎలా ఐపీఎస్ అయ్యాడో ఇందులో చూపించారు.

నిజానికి ఈ సినిమా కాదు.. మొదటి సినిమా లూటెరాతోనే మెరిశాడు విక్రాంత్. ఆ తర్వాత లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా, సెక్టర్ 36, హసీనా దిల్ రుబా, చపాక్, లాంటి ఎన్నో సినిమాలతో తన టాలెంట్ చూపించాడు.

సినిమాల్లోకి రాకముందు టీవీల్లో అద్భుతంగా రాణించాడు. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన బాలికా వధు సీరియల్ లో నటించాడు. సంచలనం సృష్టించిన మీర్జాపూర్ సిరీస్ లో కూడా ఉన్నాడు. వీటితో పాటు మరెన్నో టీవీ షోలు, వెబ్ సిరీస్ లో నటించాడు.

37 ఏళ్ల విక్రాంత్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఇలా ముందుకుసాగుతున్న టైమ్ లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని గ్రహించానని, అందుకో ఓ భర్తగా, తండ్రిగా, కొడుకుగా, ఓ నటుడిగా ఇంటికెళ్తున్నానని ప్రకటించాడు.

గడిచిన ఏళ్లుగా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాల్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన విక్రాంత్.. కొత్త ఏడాదిలో చివరిసారి ప్రేక్షకుల్ని మరోసారి కలుసుకుంటానని ప్రకటించాడు. ప్రస్తుతం అతడు 2 సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తి చేసిన తర్వాత అతడు సినిమాల నుంచి వైదొలుగుతాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలామందికి షాకింగ్.

4 Replies to “రిటైర్మెంట్ ప్రకటించిన టాలెంటెడ్ నటుడు”

Comments are closed.