రెడ్ మొదటి రోజు రూ. 6 కోట్లు పైనే

లాక్ డౌన్ తర్వాత 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు వస్తారా రారా, వసూళ్ల సంగతేంటి లాంటి ఎన్నో అనుమానాలు. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది క్రాక్ సినిమా. ఇప్పుడు రెడ్ మూవీ ఆ…

లాక్ డౌన్ తర్వాత 50శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రేక్షకులు వస్తారా రారా, వసూళ్ల సంగతేంటి లాంటి ఎన్నో అనుమానాలు. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసింది క్రాక్ సినిమా. ఇప్పుడు రెడ్ మూవీ ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి.

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన రామ్ మూవీ రెడ్ కు మొదటి రోజు రూ.6.7 కోట్ల రూపాయల షేర్ (ఏపీ+నైజాం) వచ్చింది. ఓవైపు క్రాక్, మాస్టర్ సినిమాలు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు అల్లుడు అదుర్స్ మూవీ కొన్ని థియేటర్లు లాక్ చేసినప్పటికీ.. రామ్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

ట్రేడ్ అంచనా ప్రకారం.. బి, సి సెంటర్లలో ఈ సినిమా గట్టిగా నిలబడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మూవీకి యావరేజ్ టాక్ రావడంతో.. వీకెండ్ గడిచేసరికి వచ్చిన వసూళ్లు మాత్రమే పక్కా అనుకోవాలి. ఏపీ, నైజాంలో ఈ సినిమా మొదటి రోజు బ్రేకప్ ఇలా ఉంది.

నైజాం – 2.19 కోట్లు
సీడెడ్ – 1.17 కోట్లు
నెల్లూరు – 36 లక్షలు
గుంటూరు – 46.5 లక్షలు
కృష్ణా – 35.3 లక్షలు
వెస్ట్ – 95.7 లక్షలు
ఈస్ట్ – 63.85 లక్షలు
ఉత్తరాంధ్ర – 53 లక్షలు

మంచి కిక్‌ ఇచ్చారు

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు