ఆర్ఆర్ఆర్…సెకండరీ బయ్యర్ల గగ్గోలు

ఏ సినిమాకు అయినా ఏరియాకు ఓ బయ్యర్ వుంటారు. కానీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కిందన చాలా మంది బయ్యర్లు వుంటారు. ఇది ఎలా వుంటుందీ అంటే ఓవర్ సీస్ నుంచి సీడెడ్ వరకు…

ఏ సినిమాకు అయినా ఏరియాకు ఓ బయ్యర్ వుంటారు. కానీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కిందన చాలా మంది బయ్యర్లు వుంటారు. ఇది ఎలా వుంటుందీ అంటే ఓవర్ సీస్ నుంచి సీడెడ్ వరకు ఓ భారీ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు ముక్కలు ముక్కలు గా అమ్మేయడం కామన్. 

కర్నూలు, కడప, చిత్తూరు ఇలా. అలాగే కోస్తా జిల్లాల్లో మరో ప్రాక్టీస్ వుంది. సినిమా మీద భారీ అంచనాలతో థియేటర్ల వారీగా, టౌన్ ల వారీగా సినిమాలను కొంటారు. అలాగే సి సెంటర్లలో లీజుకు ఇవ్వని థియేటర్లు పిక్స్ డ్ హయ్యర్లను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి.

ఇదంతా ఒక బెట్టింగ్ లాంటిదే. తగిలితే తగలొచ్చు.లేదంటే లేదు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇలా ఎంజి లు, పిక్స్ డ్ హయ్యర్ల మీద వెళ్లిన థియేటర్లు చాలా వున్నాయి. ముఖ్యంగా ఎంజిలు సినిమా విడుదల కు మూడు రోజుల ముందు నుంచి బేరాల ప్రారంభమై, విడుదల నాటికి సెటిల్ అవుతాయి. ఇప్పుడు బి సి సెంటర్లలో అలా ఎం జి లు కట్టిన వారంతా ఘొల్లు మంటున్నారు. 

బిసి సెంటర్లలో ఆర్ఆర్ఆర్ నాలుగోరోజుకే పడుకుంది. భారీ రేట్లు కావడంతో జనాలు దూరంగా వుండిపోయారు. పైగా సినిమా మోత, పబ్లిసిటీ అర్బన్ ఏరియా మీద ఎక్కువగా వుంది కానీ కింది సెంటర్లలో లేదు. దాంతో ఎంజి లు పెట్టిన వారంతా కుదేలయ్యారు.

అసలు ఆంధ్రలో బయ్యర్లే సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. శని, ఆదివారాలు దాటితే ఇక వారి భవిష్యత్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఈ ఎంజి లు కట్టిన వారికి మాత్రం ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 

గమ్మత్తేమిటంటే ఈ ఎంజిలు మొదటి రోజే కలెక్షన్ లు చూపించేస్తారు. మళ్లీ డైలీషేర్ కలుపుతూ అంకెలు వేస్తూ, ఎవరి కోసమో, లోలోపల బాధ భరిస్తూవుంటారు డిస్ట్రిబ్యూటర్లు.