ఫ్లాప్ హీరోయిన్ కు మరో ఛాన్స్

ఆ హీరోయిన్ అందంగా ఉంటుంది. యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంది. కానీ అదృష్టం లేదు. రీసెంట్ గా అన్నీ ఫ్లాపులే. చేసినవి మంచి సినిమాలే కానీ హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ. ఇప్పుడా హీరోయిన్…

ఆ హీరోయిన్ అందంగా ఉంటుంది. యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంది. కానీ అదృష్టం లేదు. రీసెంట్ గా అన్నీ ఫ్లాపులే. చేసినవి మంచి సినిమాలే కానీ హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ. ఇప్పుడా హీరోయిన్ కు మరో అవకాశం వచ్చింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. ఈ కాన్సెప్ట్ మూవీలో రుహానీ శర్మకు చోటు దక్కింది. సైంధవ్, ఆపరేషన్ వాలంటైన్ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

కేవలం టాలీవుడ్ ను నమ్ముకోలేదు రుహానీ శర్మ. రీసెంట్ గా గ్లామర్ డోస్ పెంచిన ఈ హీరోయిన్, ఓ హిందీ సినిమాతో పాటు తమిళ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు ఓటీటీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అయితే టాలీవుడ్ నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా వదుకోవడం లేదు. తెలుగులో ఆమె చిలసౌ, హిట్ లాంటి సినిమాలతో సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది ఆమె బోణీ కొట్టలేకపోయింది.

2 Replies to “ఫ్లాప్ హీరోయిన్ కు మరో ఛాన్స్”

Comments are closed.