సాహో మరోసాంగ్ వస్తోంది

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహోకు సంబంధించి మొత్తానికి మరో అప్ డేట్ వచ్చింది. రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఎర్రటి డ్రెస్ లో హీరోయిన్ శ్రద్ధాకపూర్…

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహోకు సంబంధించి మొత్తానికి మరో అప్ డేట్ వచ్చింది. రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్లు యూనిట్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఎర్రటి డ్రెస్ లో హీరోయిన్ శ్రద్ధాకపూర్ మాంచి గ్లామరస్ గా కనిపిస్తున్న పోస్టర్ లో, ఆమెకు జోడీగా ప్రభాస్ కూడా వున్నాడు.

సాంగ్ టీజర్ ను రేపు విడుదల చేస్తామని, ఆపైన సాంగ్ విడియో వదులుతామని తెలిపారు. చిత్రమేమిటంటే, రెండోపాట మకుటం మాత్రం ఎవరికీ అంతుపట్టకుండా వుంది. 'ఎన్ని సోని' అనే రెండు పదాలు మాత్రం పోస్టర్ మీద ప్రకటించారు. అవి తెలుగుపాట పదాలా? హిందీ పాట పదాలా? తమిళపాట పదాలా? అన్న అనుమానం కలిగేలా వున్నాయి.

ఇప్పటికే ఓ పాట విడుదల చేసారు. అదికాస్తా హిందీ డబ్బింగ్ పాటలా వుందని విమర్శలు వినిపించాయి. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మరో పాట విడుదల చేస్తున్నారు. ఈ 'ఎన్ని సోని' పదాలతో ప్రారంభమయ్యే ఆ పాట ఎలా వుంటుందో? విడుదలైతే కానీ తెలియదు. సినిమాల విజయానికి అడియో చాలా కీలకం. సాహో యూనిట్ అక్కడే ప్రయోగం చేసింది. ఒక్కో పాట ఒక్కో సంగీత దర్శకుడితో చేయించింది. వీరిలో తెలుగు మ్యూజిక్ డైరక్టర్లు ఒక్కరూ లేరు.

అన్ని పాటలు విడుదలైతే కానీ అడియో సంగతి తెలియదు.