ఆంధ్రలో, తెలంగాణ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదీ అంటే అక్రమ కట్టడాల కూల్చివేతలు. ఈ విషయంలో ప్రభుత్వాలు గట్టిగా వుండడంతో, అధికారులు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వివి వినాయక్ నిర్మించుకున్న భవనం కూడా కూల్చివేతకు గురయింది.
దర్శకుడు వివి. వినాయక్ నిర్మించుకుంటున్న భవనాన్ని అనుమతి లేదంటూ అధికారులు కూల్చివేశారు. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని వివి. వినాయక్‌కు అధికారులు నోటిసులు జారీ చేశారు. వివి. వినాయక్ నుంచి స్పందనరాకపోవడంతో నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు.
వట్టినాగులపల్లి గ్రామ పంచాయతి పరిధిలోకి వస్తోంది. అయితే ఇటీవల కాలంలో వజ్రాలపల్లిని మున్సిపాలిటీగా అధికారులు బదిలీ చేశారు. దీంతో ఈ ప్రాంతం పూర్తిగా త్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వస్తోంది. ఇక్కడ జీ+2 మాత్రమే నిర్మించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టేందుకు అధికారులు అనుమతించరు. ఈ జీవో ప్రకారం జీహెచ్ఎంసీ అధికారులు వివి.వినాయక్ భవనంపై చర్యలు తీసుకున్నారు.
ఇలాంటి వార్తలు ఇక ఎన్ని వస్తాయో, ఉభయ రాష్ట్రాల్లో.