లక్కీ డేట్ కోసం ఇన్ని రోజులు ఆగాడా?

కేజీఎఫ్ హీరో యష్ పై సోషల్ మీడియాలో చిన్నపాటి ట్రోలింగ్ నడుస్తోంది. తన సెంటిమెంట్ కోసం అభిమానుల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ అతడిపై ట్రోల్స్ వేస్తున్నారు కొంతమంది. Advertisement ఇంతకీ…

కేజీఎఫ్ హీరో యష్ పై సోషల్ మీడియాలో చిన్నపాటి ట్రోలింగ్ నడుస్తోంది. తన సెంటిమెంట్ కోసం అభిమానుల్ని ఇన్ని రోజులు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదంటూ అతడిపై ట్రోల్స్ వేస్తున్నారు కొంతమంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. యష్ హీరోగా టాక్సిక్ అనే కొత్త సినిమా ఈరోజు సెట్స్ పైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను చాన్నాళ్ల కిందటే ప్రకటించారు. యష్ కూడా ఖాళీగానే ఉన్నాడు. కావాలంటే 4 నెలల కిందటే సెట్స్ పైకి వెళ్లొచ్చు.

కానీ యష్ కావాలనే ఈరోజు వరకు ఆ సినిమాను హోల్డ్ లో పెట్టాడట. దీనికి కారణం ఈరోజు ఆగస్ట్ 8. అంటే.. 8వ నెల 8వ తేదీ అన్నమాట. ఇతడి లక్కీ నంబర్ కూడా 8. పైగా 2024లో అంకెలన్నీ కలిపితే 8. అందుకే జ్యోతిష్యుల సలహా మేరకు ఈరోజు వరకు అతడు సెట్స్ పైకి రాలేదు.

ఇది అతడి ఫ్యాన్స్ లో అసహనానికి కారణమైంది. 2022లో కేజీఎఫ్-2 రిలీజైతే, ఇప్పటివరకు మరో సినిమా ప్రారంభించకపోవడానికి కారణం ఇదేనా అంటూ దెప్పిపొడుస్తున్నారు.

ఈ ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే.. యష్ ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చాడు. ముహూర్తాలు, జాతకాలు అన్నీ చూసుకొని మరీ ఫీల్డ్ లో అడుగుపెట్టాడు. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకుడు.

2 Replies to “లక్కీ డేట్ కోసం ఇన్ని రోజులు ఆగాడా?”

Comments are closed.