కూట‌మి నేత‌ల స‌ర్క‌స్ ఫీట్లు

నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీకి వేళైంది. దీంతో కూట‌మి నేత‌లు ప‌ద‌వుల కోసం స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కొంత మంది నాయ‌కులు ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు తాము ఆశిస్తున్న ప‌ద‌వుల గురించి చెప్పారు.…

నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీకి వేళైంది. దీంతో కూట‌మి నేత‌లు ప‌ద‌వుల కోసం స‌ర్క‌స్ ఫీట్లు వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కొంత మంది నాయ‌కులు ఎమ్మెల్యే అభ్య‌ర్థులకు తాము ఆశిస్తున్న ప‌ద‌వుల గురించి చెప్పారు. ఇప్పుడు వాటిని నెరవేర్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఎమ్మెల్యేలు, మంత్రులకు గుర్తు చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రిల‌కు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన నాయ‌కులు త‌మ విన‌తులు విన్న‌విస్తున్నారని తెలిసింది.

మ‌రోవైపు బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు 20 శాతం లోపు నామినేటెడ్ పోస్టులు మాత్ర‌మే ఇవ్వ‌నున్నారు. దీంతో జ‌న‌సేన‌, బీజేపీ నాయ‌కుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ఆశావ‌హులు ఎక్కువ ఉండ‌డం, ద‌క్కే ప‌ద‌వులు మాత్రం త‌క్కువ వుండ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా అప్రాధాన్యం ఉన్న వాటిని ఇస్తారేమో అన్న ఆందోళ‌న బీజేపీ, జ‌న‌సేన నేత‌ల్లో వుంది.

మ‌రోవైపు టీడీపీలో కూడా విప‌రీత‌మైన పోటీ వుంది. చాలా మంది టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. ఎవ‌రికి ఏ ప‌ద‌వి ఇవ్వాల‌నేది చంద్ర‌బాబు, లోకేశ్ నిర్ణ‌యించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేసిన వారికే ప్రాధాన్యం ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

స్థానికంగా నాయ‌కుల స‌మ‌ర్థ‌త‌, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సుల‌ను బ‌ట్టి నామినేటెడ్ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌నున్నారు. మ‌రో ప‌ది రోజుల్లో నామినేటెడ్ ప‌ద‌వుల పంపిణీ చేయ‌నుండ‌డంతో ద్వితీయ శ్రేణి నాయ‌కులంతా ఎమ్మెల్యేలు, మంత్రుల ద‌గ్గ‌రికి పోలోమ‌ని వెళుతున్నారు.

6 Replies to “కూట‌మి నేత‌ల స‌ర్క‌స్ ఫీట్లు”

  1. కూటమి లో పార్టీలు కొట్టుకుని విడిపోవాలని.. గోతి కాడ నక్క లాగా ఎదురు చూస్తున్నాడు జగన్ రెడ్డి..

    ఇంటి బయట మాత్రం “సింగల్ సింహం” అని బోర్డు పెట్టుకుని ఉంటాడు..

  2. బాబుగారు జగన్ను గాలిలోవస్తాడు గాలిలోపోతాడు అన్నది దేనికి వర్తిస్తుంది.

Comments are closed.